ETV Bharat / international

ఆ విషయంలో భారత్​ మద్దతు కోరిన శ్రీలంక - Sri Lanka

శ్రీలంకలో మానవ హక్కులు, జవాబుదారీతనం రికార్డు పై విచారణ జరిపేందుకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్​హెచ్ఆర్​సీ) సమావేశాలు వచ్చేవారం ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత్​ మద్దతును కోరింది శ్రీలంక ప్రభుత్వం. శ్రీలంక మొట్టమొదట మద్దతు కోరుతున్న దేశం భారత్​ అని.. ఆ దేశ విదేశాంగ కార్యదర్శి జయంత్​ కొలోంబేజ్​ తెలిపారు.

Sri Lanka seeks Indian support ahead of key UNHRC sessions
ఐరాస సమావేశాల్లో భారత్​ మద్దతు కోరిన శ్రీలంక
author img

By

Published : Feb 20, 2021, 9:36 AM IST

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్​హెచ్ఆర్​సీ) సమావేశాలు వచ్చేవారం జెనీవాలో ప్రారంభం కానున్న తరుణంలో భారత్​ మద్దతు కోరింది శ్రీలంక ప్రభుత్వం. ఈ సమావేశాల్లో శ్రీలంకలో మానవ హక్కులు, జవాబుదారీతనం రికార్డుపై విచారణ జరపనున్నారు. ఈ రికార్డుపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు శ్రీలంక కోర్​ గ్రూప్, యూఎన్​హెచ్​ఆర్​సీ సంయుక్త ప్రకటన చేశాయి.

తమ దేశానికి మద్దతు ఇవ్వాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కోరామని.. శ్రీలంక విదేశాంగ శాఖ కార్యదర్శి జయంత్ కోలోంబేజ్​ అన్నారు. మద్దతు కోసం మొట్టమొదట భారత్​ను కోరామని తెలిపారు. భారత్.. తమకు మద్దతు ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

"ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలు.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్​ తమిళ ఈలం(ఎల్​టీటీఈ)తో శ్రీలంకకు జరిగిన యుద్ధంపై ఇంకా మాట్లాడు కుంటున్నాయి. అయితే ఇది అనవసర జోక్యం అవుతుంది. ప్రస్తుతం శ్రీలంక శాంతికరమైన ప్రజాస్వామ్య దేశం. యూఎన్​హెచ్ఆర్​సీ సమావేశాల్లో తమకు మద్దతు ఇవ్వమని రష్యా, చైనాను సైతం కోరతాం."

-- జయంత్ కోలోంబేజ్, శ్రీలంక విదేశాంగ శాఖ కార్యదర్శి

2009 సివిల్​ యుద్ధంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్​ తమిళ ఈలం(ఎల్​టీటీఈ), అప్పటి శ్రీలంక ప్రభుత్వం.. నేరాలకు పాల్పడ్డాయన్న ఆరోపణల్లో జవాబుదారీతనం కోరుతూ 2013లో శ్రీలంక ప్రభుత్వం తీర్మానానికి గత సర్కార్ మద్దతిచ్చింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ తీర్మానాన్ని వెనక్కితీసుకుంది.

ఇదీ చదవండి : అమెరికా కాంగ్రెస్​లో కీలక బిల్లు- 1.1కోట్ల మందికి లబ్ధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.