54 మంది భారత జాలర్లను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసిందని భారత అధికరులు తెలిపారు. శుక్రవారం నాడు 40మందిని, శనివారం 14 మందిని విడుదల చేశారని వెల్లడించారు.
మార్చి 24న శ్రీలంక సముద్ర జలాల్లోకి 54 మంది భారత జాలర్లు ప్రవేశించగా.. వారిని నౌకాదళం అధికారులు అరెస్టు చేశారు. మానవతా దృక్పథంతో వారిని విడుదల చేయాలని భారత హైకమిషనర్.. శ్రీలంక ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇందుకు పొరుగు దేశం సానుకూలంగా స్పందించింది.
ఇదీ చదవండి: తమిళుల ఆకాంక్షలను శ్రీలంక నెరవేరుస్తుంది: మోదీ
సముద్రజలాల ప్రాదేశిక సరిహద్దు అతిక్రమణల గురించి చర్చించడానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్.. జనవరిలో శ్రీలంకకు వెళ్లారు. తరువాత ఈ సమస్యను పరిష్కరించడానికి శ్రీలంక ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: 'శ్రీలంకకూ చైనా భయం- దిల్లీ వైఖరే కీలకం'