ETV Bharat / international

కరోనా భయాల మధ్యే దక్షిణ కొరియాలో ఎన్నికలు - కరోనా న్యూస్ లేటెస్ట్

ప్రపంచాన్ని కరోనా వైరస్​ వణికిస్తున్నా.. దక్షిణ కొరియాలో మాత్రం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. కొవిడ్​ భయాలు ఉన్నా ఆ దేశ ప్రజలు ఓటేసేందుకు మొగ్గుచూపుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైరస్​ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించి, శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకుని, గ్లౌజులు ధరించిన తర్వాతే ఓటేసేందుకు అనుమతిస్తున్నారు అధికారులు.

elections in south Korea
కరోనా ఉన్నా ఎన్నికలు
author img

By

Published : Apr 15, 2020, 12:28 PM IST

కరోనా భయాల నడుమ దక్షిణ కొరియాలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. మాస్క్​లు, గ్లౌజులు ధరించి ఆ దేశ పౌరులు ఓటేసేందుకు ముందుకొస్తున్నారు.

దక్షిణ కొరియా ఎన్నికల అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు కరోనా వ్యాప్తించకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటేసేందుకు వచ్చిన వారు కనీసం మూడు అడుగుల భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ సిబ్బంది పూర్తిగా రక్షణ దుస్తులు ధరించి విధులు నిర్వహిస్తున్నారు.

South Korea national elections
పోలింగ్​బూత్​ల ముందు శానిటైజర్​తో సిబ్బంది

ఓటేసేముందు..

ఓటు వేసేందుకు వస్తున్న వారు పోలింగ్ బూత్​లోకి ప్రవేశించే ముందు వారికి టెంపరేచర్​ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. హ్యాండ్​ శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకుని.. వాడిపారేసే ప్లాస్టిక్ గ్లౌజులు తొడుక్కున్న తర్వాతే లోపలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

ఎవరికైనా జ్వరం వచ్చినట్లు, లేదా మాస్క్​లు ధరించకుండా వచ్చినట్లు గుర్తిస్తే వారిని ప్రత్యేక పోలింగ్ కేంద్రాలకు తరలించి అక్కడ ఓటేసేందుకు అనుమతిస్తున్నారు.

national election in South Korea
పోలింగ్ కేంద్రం లోపల భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు

కరోనా రోగుల ఓటు..

కరోనా నిర్ధరణ అయిన వారు ఆస్పత్రుల నుంచే ఈ-మెయిల్​ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది కొరియా ఎన్నికల యంత్రాంగం. ఇలా 400 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

South Korea national elections
ఓటింగ్ ప్రక్రియ ఇలా

క్వారంటైన్​లో ఉన్నా..

ఏప్రిల్ 1 నుంచి విదేశాల నుంచి వచ్చిన వారిని రెండు వారాల పాటు క్వారంటైన్​లో ఉంచుతోంది కొరియా ప్రభుత్వం. ఇలా నిర్బంధంలో ఉన్న వారికీ ఓటేసేందుకు అనుమతిచ్చింది. అయితే వీరు సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు తాత్కాలికంగా వెసులుబాటు కల్పించింది. సాయంత్రం 6 గంటల తర్వాత వారికి ఓటేసేందుకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇలా నిర్బంధంలో ఉన్న వారిలో 13 వేల మంది ఓటేసేందుకు సిద్ధమయ్యారని వెల్లడించారు అధికారులు. వారందరినీ రెండు మీటర్ల భౌతిక దూరం పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరందరిని ఎప్పటికప్పుడు ట్రాక్​ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

South Korea national elections
ఓటేసీ బయటకు వస్తున కొరియా యువతి

అధ్యక్షుడి పార్టీకే సానుకూలం..

దక్షిణ కొరియా ఎన్నికలు ప్రధానంగా సైద్ధాంతిక ఆలోచనలు, స్థానిక అంశాల ఆధారంగా జరుగుతుంటాయి. వీటన్నింటి పరంగా ఆ దేశ అధ్యక్షుడు మూన్​ జే ఇన్​కు చెందిన లిబరల్ ప్రార్టీకే మద్దతు వస్తున్నట్లు తెలుస్తోంది. పలు సర్వేలూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి.

కరోనా వ్యాపించకుండా మూన్ ప్రభుత్వం వేగంగా స్పందించి క్వారంటైన్​ విధానం అమలు చేయడం సహా ఇతర జాగ్రత్తలు తీసుకుంది. ఫలితంగా చైనా, ఐరోపా, అమెరికాలతో పోలిస్తే ఇక్కడ కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఇవన్నీ లిబరల్​ పార్టీకి ఆదరణను మరింత పెంచాయి.

కరోనా వ్యాప్తి నేపథ్యలో దక్షిణ కొరియాలోని ప్రధాన పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించలేదు. సామాజిక మాధ్యమాల్లో భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నాయి.

దక్షిణ కొరియాలో ఇప్పటి వరకు 10,591 మందికి కరోనా సోకింది. వీరిలో 225 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:డబ్ల్యూహెచ్​ఓకు అమెరికా షాక్​- నిధులు నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.