గతేడాది చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణ కొరియాలో వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దేశంలో కొత్తగా 586 కేసులు నమోదు కాగా.. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 3,736కు చేరింది. ఈ పరిస్థితులపై దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్పందించారు. కరోనాను అరికట్టేందుకు తమ ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నిస్తోందని తెలిపారు. మరోవైపు వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 80 వేలమందికి పైగా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన నివేదికలను ఓ సారి చూాద్దాం.
వివరాలిలా..
చైనాలో ఇప్పటివరకు 2,870 మంది మరణించగా... సుమారు 79,824 కేసులు నమోదయ్యాయి.
దేశం | కేసులు | మరణాలు |
హాంకాంగ్ | 94 | 2 |
మకావ్ | 10 | - |
దక్షిణ కొరియా | 3,526 | 17 |
ఇటలీ | 1,128 | 29 |
జపాన్ | 947 | 12 |
ఇరాన్ | 593 | 43 |
సింగపూర్ | 102 | - |
ఫ్రాన్స్ | 100 | 2 |
జర్మని | 66 | - |
అమెరికా | 62 | 1 |
స్పెయిన్ | 46 | - |
కువైట్ | 45 | - |
థాయ్లాండ్ | 42 | 1 |
తైవాన్ | 39 | 1 |
బహ్రెయిన్ | 38 | - |
మలేసియా | 24 | - |
ఆస్ట్రేలియా | 23 | - |
బ్రిటన్ | 23 | 1 |
కనడా | 20 | - |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 19 | - |
వియత్నామ్ | 16 | - |
నార్వే | 15 | - |
స్వీడన్ | 13 | - |
సిట్జర్లాండ్ | 10 | - |
లెబనాన్ | 7 | - |
నెదర్లాండ్ | 7 | - |
క్రొయేషియా | 6 | - |
ఒమన్ | 6 | - |
ఆస్ట్రియా | 5 | - |
ఇజ్రాయెల్ | 5 | - |
రష్యా | 5 | - |
గ్రీస్ | 4 | - |
మెక్సికో | 4 | - |
పాకిస్థాన్ | 4 | - |
ఫిన్లాండ్ | 3 | - |
భారత్ | 3 | - |
ఫిలిప్పీన్స్ | 3 | 1 |
రొమానియా | 3 | - |
బ్రెజిల్ | 2 | - |
డెన్మార్క్ | 2 | - |
అల్జీరియా | 1 | - |
అప్గానిస్థాన్ | 1 | - |
అజర్బైజాన్ | 1 | - |
బెలారస్ | 1 | - |
బెల్జియం | 1 | - |
కాంబోడియా | 1 | - |
ఈక్వెడార్ | 1 | - |
ఈజిప్ట్ | 1 | - |
ఇస్తోనియా | 1 | - |
ఐస్లాండ్ | 1 | - |
లుథేనియా | 1 | - |
మొనాకో | 1 | - |
నేపాల్ | 1 | - |
న్యూజిలాండ్ | 1 | - |
నైజీరియా | 1 | - |
ఉత్తర మేసిడోనియా | 1 | - |
ఖతార్ | 1 | - |
సాన్ మారినో | 1 | - |
శ్రీ లంక | 1 | - |