ETV Bharat / international

మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు: చైనా

భారత్​తో సరిహద్దు వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరస్థితులు నిలకడగా ఉన్నట్టు చైనా పునరుద్ఘాటించింది. ఇరుదేశాల సమస్యలను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పింది.

Situation at Sino-India border stable, no need for 'third party' intervention: China
మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు: చైనా
author img

By

Published : Jun 3, 2020, 5:42 PM IST

భారత్​-చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన పరిష్కారానికి మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని చైనా ఉద్ఘాటించింది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే సరిహద్దు-సమాచార వ్యవస్థ, సామర్థ్యం ఇరుదేశాలకు ఉందని స్పష్టం చేసింది.

సరిహద్దుపై చైనా స్థానం స్థిరంగా, నిలకడగా ఉందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లీజియన్​ పేర్కొన్నారు. నేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాలను ఇరు దేశాలు అమలు చేశాయని తెలిపారు. సరిహద్దు అంశమై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ జరిపిన ఫోన్​ సంభాషణ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఝావో.

"భారత్​-చైనా సరిహద్దు వెంబడి పరిస్థితులు నిలకడగా, నియంత్రణలోనే ఉన్నాయి. సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం ఇరు దేశాలకు ఉంది. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాం. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు."

--- ఝావో లీజియన్​, చైనా విదేశాంగ ప్రతినిధి.

భారత్​-చైనా మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు తాను మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్​ గతవారం ప్రకటించారు. ఝావో స్పందనతో ఈ ప్రతిపాదనను చైనా వ్యతిరేకించినట్టు స్పష్టమయింది. అంతర్గత వ్యవహారాలను పరిష్కరించుకునే సామర్థ్యం తమకు ఉందని భారత్​ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- సరిహద్దు రగడపై కీలక భేటీకి భారత్​-చైనా రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.