ETV Bharat / international

శ్వాస ద్వారా కరోనా నిర్ధరణ- సింగపూర్​ శాస్త్రవేత్తల ఆవిష్కరణ - corona singapore latest news

శ్వాస ద్వారా కరోనాను నిర్ధరించేందుకు ఓ సాధనాన్ని సింగపూర్​ శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. దీని ద్వారా నిమిషం వ్యవధిలోనే ఫలితాన్ని అందించవచ్చని వారు పేర్కొన్నారు.

Singapore researchers develop breath test to detect COVID-19
' ఒక్కనిమిషంలో కొవిడ్-19 రిపోర్ట్ '​
author img

By

Published : Oct 21, 2020, 11:00 AM IST

నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ శాస్త్రవేత్తలు శ్వాస ద్వారా కొవిడ్‌-19ను నిర్ధరించే వినూత్న సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా నిమిషం వ్యవధిలోనే ఫలితాన్ని అందించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో పరీక్షలను వేగంగా నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

ఇందులో ఒకసారి వాడి పారేసే మౌత్‌పీస్‌ భాగం ఉంటుందన్న పరిశోధకులు దీనికి అత్యంత కచ్చితత్వంతో కూడిన శ్వాస శాంప్లర్‌ అనుసంధానమై ఉంటుందని తెలిపారు.

ఎలా పనిచేస్తుంది?

వ్యక్తి వదిలిన శ్వాసను ఇది సేకరించి అనంతరం ఆ నమూనాను ఒక మాస్‌ స్పెక్ట్రోమీటర్‌లోకి పంపిస్తుంది. ఆ తర్వాత ఒక మెషీన్‌ లెర్నింగ్‌ సాఫ్ట్‌వేర్‌ సదరు శ్వాస నమూనాలోని వోలటైల్‌ ఆర్గానిక్‌ పదార్థాలను విశ్లేషించి కొవిడ్‌ ఉనికిని నిమిషం కన్నా తక్కువ సమయంలోనే ఫలితాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.