ETV Bharat / international

ఆ దేశంలో ఒమిక్రాన్​ కొత్త వేరియంట్​! - ఒమిక్రాన్​ కొత్త వేరియంట్

BA.2 Variant Omicron: సింగపూర్​లో​ ఒమిక్రాన్ కొత్త వేరియంట్​ కలకలం రేపుతోంది. ఇప్పటికే భారత్​ సహా 50కు పైగా దేశాల్లో బయటపడ్డ బీఏ2 ఒమిక్రాన్​ వేరియంట్​ సింగపూర్​లో కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. 198 మంది ఈ ప్రమాదకర వేరియంట్​తో బాధపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ba2 covid variant
ఒమిక్రాన్​ కొత్త వేరియంట్ ొ
author img

By

Published : Jan 29, 2022, 3:10 PM IST

BA.2 Variant Omicron: విస్తృతంగా వ్యాప్తిచెందుతూ ప్రపంచ దేశాలను ఒమిక్రాన్​ వేరియంట్​ వణికిస్తోంది. ఈ వేరియంట్​ నుంచి సబ్​వేరియంట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. భారత్​ సహా ఇప్పటికే పలు దేశాల్లో బీఏ.2 ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు బయటపడ్డాయి. తాజాగా సింగపూర్​లో కూడా ప్రమాదకర బీఏ.2 వేరియంట్​ వెలుగు చూసింది.

ఈనెల 25 నుంచి ఇప్పటివరకు మొత్తం 198 కేసులు నమోదుకాగా.. వీటిలో 150 విదేశీ ప్రయాణికులలో గుర్తించినవని అధికారులు వెల్లడించారు. మిగిలిన 48 కేసులు స్థానికుల్లో నమోదైనట్లు తెలిపారు. అయితే ఈ సబ్​వేరియంట్​ కేసులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేశారు.

ఈ సబ్​వేరియంట్​.. ఒమిక్రాన్​ బీఏ.1 కన్నా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది.

సింగపూర్​లో శుక్రవారం కొత్తగా 5,554 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 3,38,625 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 853కు చేరింది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 50కు పైగా దేశాల్లో ఈ బీఏ.2 సబ్​వేరియంట్​ను గుర్తించారు శాస్త్రవేత్తలు.

అమెరికాలో మరణాలు..

ఒమిక్రాన్ వేరియంట్​ కారణంగా అమెరికాలో మరోసారి కరోనా మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా 2,732 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్​ వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో ఈ స్థాయి మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబరులో డెల్టా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఒక్కరోజే 2100 మరణాలు వెలుగుచూశాయి.

ఒమిక్రాన్​ తీవ్రత తక్కువే అయినా మరణాల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, టీకా తీసుకోనివారు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ వేరియంట్​ ప్రమాదకరమని తెలిపారు.

అమెరికాలో ఇప్పటివరకు 7,52,71,402 మందికి కరోనా సోకగా.. 9,05,661 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 5,22,300 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,58,06,388గా ఉంది.

ఇదీ చూడండి : కరోనా కొత్త వైరస్​ 'నియో కోవ్‌'పై డబ్ల్యూహెచ్‌ఓ ఏమంటోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.