ETV Bharat / international

ఆందోళనలు, ఆశల నడుమ భారత్​కు బంగ్లా ప్రధాని - భారత ఆర్థిక సదస్సులో బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా ప్రసంగం

గురు, శుక్రవారాల్లో బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసినా భారత్​లో పర్యటించనున్నారు. మోదీతో భేటీ సహా అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు హసీనా. నదీ జలాల ఒప్పందంపై పురోగతి సాధించవచ్చని ఆశిస్తున్నారు. ఆసోం ఎన్​ఆర్​సీపై బంగ్లాదేశ్​ వాసుల్లో ఆందోళన పెరుగుతున్న వేళ హసీనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆందోళనలు, ఆశల నడుమ భారత్​కు బంగ్లా ప్రధాని
author img

By

Published : Oct 1, 2019, 4:47 PM IST

Updated : Oct 2, 2019, 6:35 PM IST

బంగ్లాదేశ్​ ప్రధానమంత్రి షేక్​ హసీనా ఈ వారం భారత్​లో పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం హసీనా భారత్​లో పర్యటించడం ఇదే తొలిసారి.

ప్రపంచ ఆర్థిక సదస్సుకు అనుబంధంగా గురు, శుక్రవారాల్లో జరగనున్న భారత ఆర్థిక సదస్సులో బంగ్లాదేశ్​ ప్రధాని ప్రసంగించనున్నారు. భారత ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరు నేతలు భారత్​లో భేటీకావడం ఇదే తొలిసారి కానుంది. ఇరు దేశాల సంబంధాలు, ప్రాంతీయ సమస్యలపై మోదీ- హసీనా చర్చించనున్నారు.

ఎన్​ఆర్​సీనే అసలు పీట ముడి!

గత వారం న్యూయార్క్​ వేదికగా జరిగిన 74వ ఐరాస సర్వసభ్య సమావేశంలో భాగంగా ప్రధానమంత్రులు ఇద్దరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత్​ చేపట్టిన ఎన్​ఆర్​సీపై బంగ్లాదేశ్​ ఆందోళన చెందుతున్నట్టు మోదీకి తెలిపారు హసీనా. ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఆ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చని హసీనాకు మోదీ హామీ ఇచ్చినట్టు బంగ్లాదేశ్​ విదేశాంగమంత్రి అబ్దుల్​ మోమెన్​ తెలిపారు. అయితే సమావేశం అనంతరం భారత విదేశాంగశాఖ జారీ చేసి ప్రకటనలో ఎన్​ఆర్​సీ అంశం లేదు.

భారత్​ హామీనిచ్చినప్పటికీ... ఎన్​ఆర్​సీ చుట్టూ నెలకొన్న రాజకీయాలు.. భాజపా,ఆర్​ఎస్​ఎస్​ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై బంగ్లాదేశ్​ ఆవేదన వ్యక్తం చేసింది. బంగ్లాదేశీ వలసదారులను ఉద్దేశించి భారత హోంమంత్రి అమిత్​ షా ప్రయోగించిన పదజాలం ఎంతో అవమానకరంగా ఉందని తమ దేశస్థులు భావిస్తున్నట్టు హసీనా ప్రభుత్వంలోని ఓ అధికారి తెలిపారు. ఈ విషయంపై ఢాకా కేంద్రంగా పనిచేసే ఇన్స్​టిట్యూట్​ ఆఫ్​ పాలసీ, అడ్వొకసి, గవర్నెన్స్(ఐపీఏజీ) ఛైర్మన్​ స్పందించారు.​

"ఎన్​ఆర్​సీపై భారత్ నుంచి బంగ్లాదేశీయులు స్పష్టమైన ప్రకటన ఆశిస్తున్నారు. అమిత్​ షా వ్యాఖ్యల వల్ల.. ప్రధానికి మోదీ ఇచ్చిన హామీలో విశ్వసనీయత కనిపించడం లేదు."
--​ మునిర్​ ఖాస్రూ, ఐపీఏజీ ఛైర్మన్​

ఆగస్టు 31న విడుదలైన అసోం ఎన్​ఆర్​సీ వల్ల దాదాపు 19 లక్షల మంది నిరాశ్రయులకానున్నారు. అయితే న్యూయార్క్​ సమావేశానికి ముందు ఎన్​ఆర్​సీ భారత అంతర్గత విషయమని బంగ్లాదేశ్​ అంగీకరించింది. ఆర్టికల్​ 370పై బంగ్లాదేశ్​ వైఖరి కూడా ఇదే.

"ఎన్​ఆర్​సీ జాబితాలో లేని వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్​లో జీవించే అవకాశం లభించకపోతే.. వీరిలో అనేక మంది బంగ్లాదేశ్​కు వలస వస్తారని బంగ్లాదేశ్​ భయపడుతోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలే. ఎన్నో ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఎన్​ఆర్​సీ ప్రక్రియ ఇంకా అసంపూర్ణంగానే ఉంది. భాజపా, ఆర్​ఎస్​ఎస్​ ప్రకటనలు భయాన్ని పెంచుతున్నాయి."
-- పినాక్​ చక్రవర్తి, భారత మాజీ రాయబారి

నీటి వాటాల సంగతేంటి..?

ఎన్​ఆర్​సీతో పాటు అనేక సమస్యలపై బంగ్లాదేశీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీస్తా సహా ఇరు దేశాలకు చెందిన 54 నదీజలాల పంపకాలపై ఎన్నో ఏళ్లుగా సందిగ్ధం నెలకొంది. గత 5ఏళ్ల పాలన సమయంలోనే తీస్తా నదీ జలాల సమస్యను పరిష్కరించాలని మోదీ-హసీనా భావించారు.

నిజానికి తీస్తా నదీజాలలకు సంబంధించిన ఒప్పందంపై మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ 2011లోనే సంతకం పెట్టాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుపడడం వల్ల ఒప్పందం కుదరలేదు. రాజకీయాలతో ముడిపడిన సున్నితమైన అంశం ఇది.

"తమ దేశం నుంచి భారత్​లోకి జరుగతున్న అక్రమ చొరబాట్లు, ఉగ్రవాద కార్యకలాపాల కట్టడిలో హసీనా విజయం సాధించారు. దీని వల్ల భారత్-బంగ్లా సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొంది. ఎంతో కాలంగా మిగిలిపోయిన తీస్తా నదీ జలాల ఒప్పందంపై భారత్​ సంతకం చేయడం, ఎన్​ఆర్​సీ సమస్యలను పరిష్కరించడం రాజకీయ గౌరవానికి సంబంధించినవి."
--​ మునిర్​ ఖాస్రూ, ఐపీఏజీ ఛైర్మన్​

గురువారం ఉదయం దిల్లీకి చేరుకోనున్నారు హసీనా. భారత ఆర్థిక సదస్సులో ప్రసంగించనున్న హసీనా... తన నేతృత్వంలో గత పదేళ్లలో బంగ్లాదేశ్​ ఏ విధంగా అభివృద్ధి సాధించిందన్న అంశాన్ని వివరించనున్నారు. ఈ సదస్సుల్లో సింగపూర్​ ఉప ప్రధాని, ఆర్థికమంత్రి హెంగ్​ స్వీ కియట్​, దక్షిణాసియాలోని యూఎన్​ మహిళా రాయబారి, భారత్​ టెన్నిస్​ స్టార్​ క్రీడాకారిణి సానియా మీర్జా సహా ఇతర ముఖ్య అధికారులు పాల్గొనున్నారు. 'ఇన్నోవేటివ్​ ఫర్​ ఇండియా: స్ట్రెంతెనింగ్​ సౌత్​ ఏషియా, ఇంపాక్టింగ్​ ది వరల్డ్​' అనేది ఈ సదస్సు థీమ్​. దక్షణాసియా- ఏఎస్​ఈఏఎన్​ మధ్య సహకారాలు మెరుగుపరచడంపై ఈ సదస్సు దృష్టి సారించనుంది.

ఈ నెల 4న కొందరు భారత సీఈఓలతో బంగ్లాదేశ్​ ప్రధాని భేటీకానున్నారు. భారత్​- బంగ్లాదేశ్​​ వాణిజ్య సదస్సును ప్రారంభిస్తారు. భారత పెట్టుబడిదారులను ఆకర్షించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం.

"భారత ఎఫ్​డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) సుమారు 3 బిలియన్​ డాలర్ల కన్నా ఎక్కువగా ఉంది. ఎస్​ఈజెడ్​(ప్రత్యేక ఆర్థిక జోన్లు) పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చితే ఎఫ్​డీఐ మరింత పెరుగుతుంది. అవినీతి, వసతి సదుపాయాల్లో లోటు ఎఫ్​డీఐపై ప్రభావం చూపుతోంది. మిర్సారి, మొంగ్లాలోని భారతీయ ఎస్​ఈజెడ్​లు కార్యరూపం దాల్చితే భారత ఎఫ్​డీఐ పెరుగుతుంది."
-- పినాక్​ చక్రవర్తి, భారత మాజీ రాయబారి

ఈ నెల 5న జరగనున్న మోదీ- హసీనా భేటీకి ముందు... భారత విదేశాంగ మంత్రి జై​శంకర్​ బంగ్లాదేశ్​ ప్రధానితో చర్చలు జరిపే అవకాశముంది. అనంతరం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు మోదీ-హసీనా. బంగ్లాదేశ్​లో ఉంటున్న రోహింగ్యాలను మయన్మార్​కు తిరిగి పంపే అంశంపై భారత్​ వైఖరి, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ప్రధానమంత్రులు ప్రధానంగా చర్చించే అవకాశముంది. అనంతరం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలవనున్నారు హసీనా.

ఆక్టోబర్​ 6న కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ బంగ్లాదేశ్​ ప్రధానితో సమావేశంకానున్నారు. తన తండ్రి బంగబంధు షేక్ ముజిబర్ రెహ్మాన్​ బయోపిక్​ నిర్మాణంపై ప్రముఖ దర్శకుడు శ్యామ్​ బెనగల్​తో హసీనా చర్చించనున్నారు. 2020 మార్చి 17న బంగ్లాదేశ్​ జాతిపిత ముజిబుర్​ రెహ్మాన్​ శతజయంతి ఉత్సవాలు 'ముజిబ్​ బర్షా' ప్రారంభమవుతాయి. ఈ చారిత్రక వేడుకలోపు బయోపిక్​ పూర్తవ్వాలని ఆశిస్తున్నారు బంగ్లాదేశ్​ ప్రధాని.

(రచయిత- స్మితా శర్మ, సీనియర్ పాత్రికేయురాలు)

ఇదీ చూడండి: ఆదిపరాశక్తి ముందు అగ్నిదేవుడితో గార్బా!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 1 October 2019
1. Wide of police and protesters near Central Station, zoom in
2. Police water cannon vehicle travelling along road
3. Firefighters putting out fire, pan to journalists
4. Protesters in street and tear gas
5. Protesters in dressed black running
6. Close of police confronting protesters, zoom into police holding protester on ground
7. Various of police holding protester to the ground
8. Various of fire in container
9. Protester being reprimanded by police
10. Protesters running near Central Government Complex
11. Various of protesters
12. Zoom into riot police
13. Tear gas smoke
14. Various of protesters being constrained by police
15.Close of fire  
16. Various of police and fire at Sha Tin in New Territories
17. Various of police
STORYLINE:
Riot police fired tear gas and water cannon on Tuesday to disperse thousands of pro-democracy protesters in several districts in Hong Kong.
Multiple rallies were held across the city, challenging the Chinese Communist Party (CCP) as it marks its 70th year of rule.
Police fired rounds of tear gas at the Wong Tai Sin, Sha Tin, Tsuen Wan and Tuen Mun areas as protesters hurled gas bombs, bricks and other objects in their direction.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.