ETV Bharat / international

భారీ వర్షాలతో ఆస్ట్రేలియా అతలాకుతలం

ఆస్ట్రేలియాలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సాగర తీరంలో అలలు భారీఎత్తున ఎగసిపడుతున్నాయి.

Severe wet weather continues for fifth day in Australia
ప్రమాదకరంగా వాతావరణ పరిస్థితులు
author img

By

Published : Dec 15, 2020, 6:21 PM IST

ఆస్ట్రేలియా న్యూసౌత్‌వేల్స్‌ తీరంలో అనేక ప్రాంతాల్లో ఐదు రోజులుగా వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మరోవైపు సాగర తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. బలమైన గాలులు వీయడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.

ఉత్తర తీరంలో 1000 ఇళ్లకు రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంకా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది.

ఆస్ట్రేలియాలో ప్రమాదకరంగా వాతావరణ పరిస్థితులు!

ఇదీ చూడండి: టోంగాలో భూకంపం- 5.1 తీవ్రత నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.