పాకిస్థాన్లో దుర్ఘటన జరిగింది. నీళ్ల ట్యాంక్ కింద పిల్లలు ఆడుకుంటుండగా ఒక్కసారిగా అది కూలి వారిపై పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఖైబుర్ పఖ్తుంఖ్వా రాష్ట్రం మహ్మద్ ట్రైబల్ జిల్లాలో జరిగింది. చనిపోయిన పిల్లల వయస్సు 4నుంచి 12ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
సహాయసిబ్బంది వచ్చి మృతదేహాల్ని ట్యాంక్ కిందనుంచి తీశారు. గాయపడ్డ మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల మృతి పట్ల ఖైబర్ పఖ్తంఖ్వా రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: పాఠశాల సమీపంలో పేలుడు- 25 మంది మృతి!