తైవాన్ తూర్పు తీరాన్ని వరుస భూకంపాలు.. బుధవారం వణికించాయి. ఏకంగా 22 సార్లు భూమి కంపించిందని అక్కడి కేంద్ర వాతావరణ శాఖ(సీడబ్ల్యూబీ) తెలిపింది. ఉదయం 6:52 నుంచి రెండు గంటల వ్యవధిలోనే ఇవి ఏర్పడినట్లు చెప్పింది. ఈ భూకంపాల వల్ల పలు ప్రాంతాల్లో స్వల్పంగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది.
మొదటి భూకంపం రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో సంభవించగా.. 5.9 కిలోమీటర్ల లోతులో భూకంపం ఉన్నట్లు సీడబ్ల్యూబీ చెప్పింది. మిగతావి 3.0 నుంచి 5.0 తీవ్రతతో సంభవించినట్లు తెలిపింది. భూకంపం కారణంగా హవేలియన్ కౌంటీలో పలు భవనాలు ధ్వంసమైనట్లు అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: తండ్రి సాహస యాత్ర- కొడుకు కోసం బైక్పై లక్షల కి.మీ...