ETV Bharat / international

ముష్కరుల దుశ్చర్య.. 14 మంది సైనికులు మృతి - taliban attacks

అఫ్గానిస్థాన్​లో ముష్కరులు రెండు వేరు వేరు ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ ఘటనల్లో 14 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Afghan forces in Kabul
అఫ్గాన్​లో ముష్కరుల దుశ్చర్య
author img

By

Published : Jun 6, 2020, 6:40 PM IST

అఫ్గానిస్థాన్​లో బాంబులు, కాల్పుల మోత కొనసాగుతోంది. తాలిబన్ల దాడిలో 10 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన మరుసటి రోజునే ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. ఈశాన్య బదాక్షన్​ రాష్ట్రం సహా రాజధాని కాబూల్​ పరిధిలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ ఘటనల్లో 14 మంది అఫ్గాన్​ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

బదాక్షన్​ రాష్ట్రంలోని ఖాష్​ జిల్లాలో పోలీసు తనిఖీ కేంద్రం (చెక్​పాయింట్​)పై దాడులు జరిగిన నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న వాహనాన్ని రోడ్డు పక్కన బాంబు పెట్టి పేల్చేశారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు మృతి చెందారు. బాంబు దాడితో పాటు ఇరు వర్గాల మధ్య కాల్పులూ జరిగాయి. ఇందులో నలుగురు ముష్కరులు ప్రాణాలు కోల్పోయినట్లు బదాక్షన్​ పోలీసు ఉన్నతాధికారి సనాఉల్లాహ్​ రోహాని తెలిపారు.

మరో ఘటనలో... కాబూల్​ పరిధిలోని గుల్దారా జిల్లాలో చొరబాటుదారులు పోలీసుల చెక్​పాయింట్​పై దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య సుమారు గంటపాటు భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది మృతి చెందినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి తారిఖ్​ అరియన్​ తెలిపారు.

ఈ రెండు ఘటనలు చేసింది తాలిబన్లేనని ఇరువురు అధికారులు పేర్కొన్నారు. అయితే.. దాడులకు ఏ ఉగ్రసంస్థా బాధ్యత వహించలేదు.

ఇదీ చూడండి: 'నేను మళ్లీ అధ్యక్షుడిని అవ్వకపోతే.. ఇక అంతే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.