ETV Bharat / international

అక్టోబర్ 16న భారత్-నేపాల్ పెట్టుబడుల ఎక్స్​పో - The second edition of the Nepal-India Franchise Investment Expo and Conclave October 16-18

భారత్-నేపాల్ మధ్య రెండో విడత పెట్టుబడుల ఎక్స్​పో అండ్ కాంక్లేవ్​ను అక్టోబర్ 16-18 తేదీల్లో నిర్వహించనున్నారు. నేపాల్​లోని భారత రాయబార కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమం ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొంది.

Second Nepal-India Franchise Investment Expo and Conclave to start from October 16
అక్టోబర్ 16న భారత్-నేపాల్ మధ్య పెట్టుబడుల ఎక్స్​పో
author img

By

Published : Oct 3, 2020, 7:21 PM IST

నేపాల్-భారత్ రెండో విడత పెట్టుబడుల ఎక్స్​పో కార్యక్రమాన్ని అక్టోబర్ 16-18న నిర్వహించనున్నారు. 3డీ సాంకేతికత ఆధారిత వర్చువల్ వేదిక ద్వారా మూడు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. 'నేపాల్-ఇండియా ఫ్రాంఛైజ్ ఇన్వెస్ట్​మెంట్ ఎక్స్​పో అండ్ కాంక్లేవ్' పేరిట ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాఠ్​మాండూలోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఫెడరేషన్ ఆఫ్ నేపాలీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, నేపాల్ ఫ్రాంచైజీ.కామ్ ఈ కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

"భారత్, నేపాల్ దేశాల్లోని బ్రాండ్లు, ఫ్రాంచైజీలు ఇరుదేశాలకు భారీగా ప్రయోజనం కలిగిస్తాయి. వ్యాపారాలు, త్వరగా ప్రారంభించేందుకు పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పిస్తాయి. రెండో దఫాలో జరుగుతున్న ఈ సదస్సు ద్వారా భారత్​లోని ప్రముఖ బ్రాండ్లు నేపాల్​కు, నేపాల్​లోని బ్రాండ్లు భారత్​కు వచ్చేందుకు తోడ్పడుతుంది. ఈ వ్యాపారాలు ఒక దేశం నుంచి మరో దేశానికి రావడం వల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థలకు మేలు కలుగుతుంది."

-నేపాల్​లోని భారత రాయబార కార్యాలయం

ఈ ఎక్స్​పో తొలి ఎడిషన్​ను 2019 మేలో నిర్వహించారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. భారత్​కు చెందిన 70 బ్రాండ్లు సహా 20 నేపాలీ బ్రాండ్లు ఇందులో పాల్గొన్నాయి. 2 వేల మందికి పైగా నేపాలీ పారిశ్రామిక వేత్తలు ఇందులో పాల్గొన్నారు. భారత పారిశ్రామికవేత్తలతో అనుసంధానం వల్ల వ్యాపారాల్లో అవకాశాలపై ఓ అవగాహనకు వచ్చారు.

ఇదీ చదవండి- 'హాథ్రస్​ వ్యవహారాన్ని డబ్బుతో సెటిల్​ చేసేశాం కదా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.