ETV Bharat / international

'చైనా మాంసపు విక్రయాలపై కఠినంగా వ్యవహరించండి' - ఐక్యరాజ్యసమితి

ప్రపంచ మానవాళికి చైనా మాంసపు విక్రయాలు పెను ప్రమాదమని.. ఇలాంటి వెట్​ మార్కెట్లపై తగు చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్​ఓ, ఐక్యరాజ్యసమితిని కోరారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​. కరోనా కేసులు 10 లక్షలు దాటి.. మరింత భయంకరంగా పరిణమిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Scott Morrison urges WHO, UN to act against China's wet markets
'చైనా మాంసపు విక్రయాలను నిషేధించండి'
author img

By

Published : Apr 3, 2020, 4:06 PM IST

కరోనా వైరస్​ సృష్టికి కారణమని భావిస్తున్న.. చైనా మాంసపు విక్రయాలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని డబ్ల్యూహెచ్​ఓ, ఐక్యరాజ్యసమితిని కోరారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​. ఆ తరహా మాంసం తినడం వల్ల ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదమని, ప్రపంచ జీవన మనుగడే కష్టమని వ్యాఖ్యానించారు.

''మానవాళి ఆరోగ్యంపై ప్రపంచ కోణం నుంచి ఆలోచిస్తే.. ప్రపంచ ఆరోగ్య సంస్థనే(డబ్ల్యూహెచ్​ఓ) ఏదైనా చేయాలి. ఈ చర్యలు.. డబ్ల్యూహెచ్​ఓ, ఐక్యరాజ్యసమితి నుంచే ఉండాలి. ''

- స్కాట్​ మోరిసన్​, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 10 లక్షలు దాటాయి. మృతుల సంఖ్య 54 వేలకుపైనే. దాదాపు అన్ని దేశాలకూ విస్తరించింది. ఈ నేపథ్యంలోనే పైవ్యాఖ్యలు చేశారు మోరిసన్​.

''వెట్​ మార్కెట్లు ​ఎక్కడైతే ఉన్నాయో.. అక్కడ అది ప్రధాన సమస్య. ఈ వైరస్​ చైనాలో ప్రారంభమైంది. ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. అసలు అది ఎలా పుట్టుకొచ్చినట్లు మరి..?.''

చైనాలో కరోనా ఎలా ప్రారంభమైందో మనందరికీ తెలుసని.. వాటి వల్ల ఏం జరుగుతుందో కూడా అవగాహన ఉందని పరోక్షంగా ఆ దేశాన్ని ఉద్దేశించి విమర్శించారు.

వుహాన్​ నుంచే...

చైనా ప్రధాన నగరం వుహాన్​లోని ఓ వెట్ మార్కెట్(మాంసం విక్రయశాల) నుంచే కరోనా వైరస్​ ఉద్భవించిందని అందరూ నమ్ముతున్నారు. ఈ వాస్తవాన్ని చైనా అంగీకరించకపోవడం గమనార్హం. తొలి కేసు గతేడాది డిసెంబర్​లో వెలుగుచూసింది.

ఈ వెట్​ మార్కెట్లలో గబ్బిలాలు, పాములు, పునుగు పిల్లులు, అలుగులు, ముళ్లపందుల వంటి అడవి జంతువులే కాక.. పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువుల మాంసాలూ విక్రయిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.