షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యదేశాలు తజకిస్థాన్‌లోని దుషాన్‌బేలో సమావేశమయ్యాయి. అంతర్జాతీయ ఉగ్రవాదం, వేర్పాటువాదంపై కలిసి పోరాడాతామని సభ్యదేశాల జాతీయ భద్రతా సలహాదారులు ప్రమాణం చేశారు. అంతేకాకుండా మత ఉగ్రవాదం, ప్రణాళిక ప్రకారం జరిగే నేరాలు, డ్రగ్ మాఫియా తదితర సమస్యలపై ఉమ్మడిగా పోరాడాలని చర్చించారు.
ప్రాంతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎస్సీఓ ప్రణాళిక..సభ్యదేశాలలో భద్రతను, బంధాన్ని ఏర్పరుస్తుందని అన్నారు. ఈ సమావేశానికి భారత్ తరపున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ హాజరయ్యారు.
ఇదీ చదవండి: Universal Vaccine: అన్ని వైరస్‌లపై..ఒకే ఆయుధం!