ETV Bharat / international

యుద్ధ సన్నద్ధత పెంచండి: చైనా అధ్యక్షుడి కీలక ఆదేశం - జిన్​పింగ్

ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యుద్ధ సన్నద్ధతను పెంచాలని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ ఆ దేశ సైన్యానికి పిలుపునిచ్చారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే విధంగా సిద్ధంగా ఉండాలన్నారు.

jinping
జిన్​పింగ్
author img

By

Published : May 26, 2020, 10:33 PM IST

Updated : May 27, 2020, 9:29 AM IST

యుద్ధ సన్నద్ధంగా ఉండాలని చైనా సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్​పింగ్. దేశ సమగ్రతను కాపాడేందుకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. పీపుల్స్​ లిబరేషన్ ఆర్మీ ప్లీనరీ సమావేశం సందర్భంగా జిన్​పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అత్యంత ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శిక్షణ కార్యక్రమాలు, యుద్ధ సన్నద్ధతను పెంచాలన్నారు జిన్​పింగ్. క్లిష్ట సమయాల్లోనూ దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడే విధంగా సిద్ధమవ్వాలని పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా భారత్​- చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో జిన్​పింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వివాదాస్పద చైనా సముద్రం, తైవాన్ జలసంధిలో అమెరికా నావికా దళం గస్తీ నౌకలను దించడం కూడా ఈ వ్యాఖ్యలకు కారణమని తెలుస్తోంది.

సరిహద్దుల్లో తరచూ ఘర్షణలకు దిగడం ద్వారా కంటిమీద కునుకు లేకుండా చేసి, భారత్‌ను అస్థిర పరచాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అధికార దాహంతో తపించిపోతున్న డ్రాగన్‌ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సైనిక రంగాల్లో దుందుడుగ్గా ప్రవర్తిస్తోంది. లద్దాఖ్‌ సెక్టార్‌లో భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి గొడవపడే విషయంలో చైనాకు కరోనా మహమ్మారి సమస్యా అడ్డంకి కావడం లేదు. చైనా సకాలంలో స్పందించి, విదేశాలకు వెళ్లే విమానాలను గత ఏడాది డిసెంబరు నుంచే నిలిపివేసి ఉంటే, ప్రాణాంతక వైరస్‌ కార్చిచ్చులా వ్యాపించి ఉండేది కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజారోగ్య వ్యవస్థలు విఫలమయ్యేవీ కావు.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

భారత్‌, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతల తాకిడికి హిమమయ లద్దాఖ్‌లో వేడి రాజుకుంటోంది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌పై పోరులో నిమగ్నమైన వేళ.. అదును చూసి ‘డ్రాగన్‌’ బుసలు కొడుతోంది. సరిహద్దుల్లో ప్రశాంతతకు భంగం కలిగించేలా వేల సంఖ్యలో సైన్యాన్ని తరలించింది. చైనాకు దీటుగా మన సైన్యం కూడా అక్కడ బలగాలను మోహరించింది. ఇప్పుడు ఇరు దేశాల సైనికులు ఢీ అంటే ఢీ అనే రీతిలో ఎదురెదురుగా నిలబడ్డారు.

డోక్లామ్‌లో..

2017లో భూటాన్‌లోని డోక్లామ్‌లో 73 రోజుల పాటు భారత్‌, చైనాల మధ్య సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. ఉభయ దేశాలను ఇది యుద్ధం ముంగిట్లోకి తీసుకెళ్లింది. అయితే రాజకీయ, దౌత్య చర్చల ద్వారా వివాదం పరిష్కారమైంది.

ఇదీ చూడండి: ఢీ అంటే ఢీ: సరిహద్దులో భారత్​- చైనా బలగాల మోహరింపు

Last Updated : May 27, 2020, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.