దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి(సార్క్) విదేశాంగ మంత్రుల సమావేశం (SAARC Foreign Ministers Meet Cancelled) ఆకస్మికంగా రద్దయింది. అమెరికా న్యూయార్క్‌లో శనివారం.. ఈ భేటీ (SAARC Summit 2021) జరగాల్సి ఉంది. అఫ్గానిస్థాన్ నుంచి తాలిబన్లకు(Afghanistan news) ఈ సమావేశంలో ప్రాతినిధ్యం కల్పించాలని పాకిస్థాన్ (Pakistan news) పట్టుబట్టినట్లు సమాచారం. భారత్ సహా మరికొన్ని దేశాలు ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరని కారణంగా.. సార్క్ మీట్ (SAARC Summit 2021) రద్దు అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA 2021) భాగంగా.. ఏటా ఈ సార్క్(SAARC news) సమావేశాలు జరుగుతుంటాయి. ఈసారి అఫ్గాన్ కుర్చీ ఖాళీగా ఉన్నా ఏమీకాదని చాలా సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. దీనికి ఒప్పుకోని పాక్.. సమావేశం రద్దుకు కారణమైంది.
గత ఆగస్టు 15న అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ (Ashraf Ghani).. దేశం విడిచి పారిపోయిన అనంతరం కాబుల్‌ను తమ వశం చేసుకున్నారు తాలిబన్లు. ఒక్కొక్కటిగా దేశం మొత్తాన్ని వారి అధీనంలోకి వచ్చింది. కొద్దిరోజులకు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే.. ఇప్పటివరకు తాలిబన్లను (Taliban latest news) భారత్ అధికారికంగా గుర్తించలేదు. అంతర్జాతీయ సమాజం కూడా.. అఫ్గాన్ కొత్త ప్రభుత్వంపై ఒక నిర్ణయానికి రాలేదు. ఇంకా.. తాలిబన్ సర్కార్‌లోని పలువురు కేబినెట్ మంత్రులు ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్ట్‌లో ఉన్నారు. ఈ కారణంతో అఫ్గానిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖి వాస్తవానికి.. ఐక్యరాజ్యసమితికి సంబంధించి ఎలాంటి సమావేశాల్లోనూ పాల్గొనేందుకు అవకాశం కూడా లేదు.
మోదీ కూడా..
గతవారం షాంఘై సహకార సదస్సులోనూ (ఎస్సీఓ) భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi on Taliban).. అఫ్గాన్‌లో ఏర్పడింది సమ్మిళిత ప్రభుత్వం కాదని, అక్కడి ప్రభుత్వాన్ని గుర్తించే విషయంపై అంతర్జాతీయ సమాజం విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలన్నారు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సార్క్ అనేది దక్షిణ ఆసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం(SAARC news). భారత్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
గుర్తింపు కోసం ఎదురుచూపులు..
తాము ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని తాలిబన్లు (Afghanistan Taliban) అభ్యర్థిస్తున్నారు. ఐరాస 76వ వార్షిక సమావేశాల్లో(UNGA 2021).. ప్రపంచదేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆటోనియో గుటెరస్‌కు రాసిన ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చూడండి: గుర్తింపు కోసం తాలిబన్ల ఆరాటం- ఐరాసకు లేఖ
Massoud Afghan: తాలిబన్లను ఢీకొట్టేందుకు భారత్ సాయం కోరిన మసూద్?