ముగ్గురు వ్యోమగాముల బృందం బుధవారం రికార్డు స్థాయిలో మూడు గంటల మూడు నిమిషాలు ప్రయాణించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారిని ఇంత తక్కువ సమయంలో అంతరిక్ష కేంద్రానికి చేర్చిన ఘనత రష్యన్ అంతరిక్ష సంస్థకు దక్కింది. ఈ ఆర్బిటల్ ల్యాబ్‌ను చేరుకునేందుకు చేపట్టిన అత్యంత వేగవంతమైన మానవ సహిత ప్రయాణం ఇదేనని ఆ సంస్థ వెల్లడించింది. రష్యాకు చెందిన అంతరిక్ష కార్యక్రమాలను నిర్వహించే రోస్కాస్మోస్ ఈ విషయాన్ని ధ్రువీకరించగా, 'మూడు గంటల మూడు నిమిషాలు' అని ఆ సంస్థ చీఫ్ దిమిత్రీ రోగోజిన్ ట్వీట్ చేశారు.
-
И мы это сегодня сделали за 3 часа и 3 минуты pic.twitter.com/Y2ja5FD2Nc
— РОГОЗИН (@Rogozin) October 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">И мы это сегодня сделали за 3 часа и 3 минуты pic.twitter.com/Y2ja5FD2Nc
— РОГОЗИН (@Rogozin) October 14, 2020И мы это сегодня сделали за 3 часа и 3 минуты pic.twitter.com/Y2ja5FD2Nc
— РОГОЗИН (@Rogozin) October 14, 2020
రష్యా స్పేస్ ఏజెన్సీకి చెందిన సెర్గే రిజికోవ్, సెర్గే కుద్-వెర్చ్‌కోవ్, నాసాకు చెందిన కేత్ రూబిన్స్లు బుధవారం ఉదయం కజక్‌స్థాన్‌లోని బైకొనుర్ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్ ఎంఎస్-17 రాకెట్ ద్వారా ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ఆరు నెలల పాటు వారు అక్కడే ఉంటారు. మామూలుగా అయితే అక్కడికి చేరుకుకోవడానికి ఆరు గంటల సమయం పడుతుంది. కాగా, ఇప్పుడు ఆ సమయాన్ని రష్యా మూడు గంటలకు కుదించి రికార్డు సృష్టించింది.
''ఐఎస్ఎస్లోని రష్యా విభాగం నుంచి ఆక్సిజన్ లీకవుతోంది. దాని కారణంగా ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు. మేము ఎక్కడ నుంచి ఆక్సిజన్ లీకవుతుందో గుర్తించి, మరమ్మతులు చేపడతాం. ఇందుకు అవసరమైన సరంజామాను మాతో పాటూ తీసుకెళ్తున్నాం.'' అని రిజికోవ్ తెలిపారు.
యాత్రకు ముందు ఈ ముగ్గురూ పలుమార్లు కొవిడ్ పరీక్షలు చేయించుకొని, క్వారంటైన్లో కూడా ఉన్నారు. వీరు ఐఎస్ఎస్కు చేరుకోవడంతో.. గత ఏప్రిల్ నుంచి అక్కడే ఉంటున్న మరో ముగ్గురు వ్యోమగాములు వారం రోజుల్లో తిరిగి భూమికి పయనమవుతారు.