ETV Bharat / international

ట్యాంకర్లతో లవ్ షేప్.. ప్రేయసికి సైనికాధికారి ప్రపోజ్​

author img

By

Published : Feb 14, 2020, 10:43 PM IST

Updated : Mar 1, 2020, 9:12 AM IST

ఓ రష్యా సైనికుడు వాలెంటైన్స్​డే రోజున తన ప్రియురాలికి ప్రపోజ్​ చేసేందుకు 16 యుద్ధ ట్యాంకర్లతో లవ్​ సింబల్​ను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత గులాబీ పుష్ప గుచ్ఛంతో తన ప్రేమను వ్యక్తపరిచాడు.

Russian soldier rolls out tanks for romantic manoeuvre
ట్యాంకర్లతో లవ్ షేప్.. ప్రేయసికి సైనికాధికారి ప్రపోజ్​

ప్రేమికుల రోజున తనకు నచ్చిన వ్యక్తికి 'ఐ లవ్ ​యూ' అంటూ తన మనసులోని మాటను తెలియజేస్తారు ప్రేమికులు. అయితే రష్యా సైనికుడు మాత్రం వినూత్న రీతిని ఎంచుకున్నాడు. తన మనసులోని మాటను ప్రేయసికి తెలిపేందుకు ఆమె వెళ్లే మర్గాన్ని నిలిపివేశాడు. ఆ తర్వాత 16 యుద్ధ ట్యాంకర్లతో ప్రేమకు చిహ్నమైన లవ్ సింబల్​ను ఏర్పాటు చేశాడు. గులాబీ పుష్పగుచ్ఛంతో మోకాళ్లపై నిల్చోని ప్రపోజ్​ చేశాడు. ఊహించని ఈ పరిణామానికి మురిసిపోయిన ప్రేయసి తన ప్రియుడితో ఏడడుగులు వేసేందుకు అంగీకరించింది.

రష్యా సైనికాధికారి డెనిస్ కజంట్‌సేవ్ తన ప్రియురాలికి చేసిన ప్రపోజ్​ దృశ్యాలను ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వీడియో తీసింది. చాలా ఏళ్లుగా స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరు ప్రేమికుల రోజున ఒక్కటయ్యారని పేర్కొంది.

ఇదీ చూడండి:దిల్లీ సీఎంగా ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్

Last Updated : Mar 1, 2020, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.