ETV Bharat / sports

క్రికెట్​లో సంచలనం- ఒకే ఇన్నింగ్స్​లో 10 వికెట్లు- మరో 'కుంబ్లే' దొరికేశాడోచ్! - 10 Wickets In An Innings - 10 WICKETS IN AN INNINGS

10 Wickets In An Innings : క్రికెట్​లో సింగిల్ ఇన్నింగ్స్​లో 10 వికెట్లు పడగొట్టిన సందర్భాలు చాలా అరుదు. తాజాగా ఓ బౌలర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. మరి అది ఓ టోర్నీ? అతడు ఎవరంటే?

10 Wickets In An Innings
10 Wickets In An Innings (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 23, 2024, 7:53 PM IST

10 Wickets In An Innings : క్రికెట్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్​లో బౌలర్ 10 వికెట్లు దక్కించుకున్న సందర్భాలు చాలా అరుదు. గతంలో జిమ్ లేకర్ (ఇంగ్లాండ్), అనిల్ కుంబ్లే (భారత్), అజాజ్ పటేల్ (న్యూజిలాండ్) ఈ ముగ్గురు క్రికెటర్లు టెస్టు మ్యాచ్​ ఒకే ఇన్నింగ్స్​లో 10 వికెట్లు దక్కించుకున్నారు. తాజాగా ఈ ఫీట్ మరోసారి నమోదైంది. మరి అది ఎక్కడంటే?

ముంబయి డొమెస్టిక్ టోర్నమెంట్ కంగా లీగ్ (Kanga League)లో ఈ ఫీట్ రిపీట్ అయ్యింది. టోర్నీలో గౌడ్ సరస్వత్ సీసీ (Gaud Saraswat CC) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షోయబ్ ఖాన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. లీగ్​లో భాగంగా రీసెంట్​గా జాలీ క్రికెటర్స్ (Jolly Cricketer's) జట్టుతో జరిగిన మ్యాచ్​లో షోయబ్ ఒకే ఇన్నింగ్స్​లో 10 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్​ఫస్ట్ ఇన్నింగ్స్​లో 17.4 ఓవర్లు బౌలింగ్ చేసిన షోయబ్ ప్రత్యర్థి జట్టును 67 పరుగులకు ఆలౌట్ చేశాడు. దీంతో ఈ అరుదైన ఘనత సాధించిన బౌలర్​గా నిలిచాడు. ఇది చూసిన నెటిజన్లు భారత్​కు మరో అనిల్ కుంబ్లే దొరికేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

అసలేంటీ కంగా లీగ్
ఇది ముంబయి డొమెస్టిక్ క్రికెట్ లీగ్​ల్లో ఒకటి. ముంబయికి చెందిన మాజీ క్రికెటర్ హోర్ముజీ కంగా జ్ఞాపకార్థం ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఫస్ట్ క్లాస్​ క్రికెట్​లో కంగా 1905 పరుగులు, 33 వికెట్లు పడగొట్టాడు. అతడు అప్పట్లో ముంబయిలోని శివాజీ పార్క్, క్రాస్ మైదాన్, అజాద్ మైదాన్ లాంటి ప్రతిష్ఠాత్మక గ్రౌండ్స్​లో ఆడాడు. కాగా, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సైతం ఈ టోర్నీలో ఆడాడు. సచిన్ 11ఏళ్ల వయసులో 1984లో తొలిసారి కంగా లీగ్ టోర్నీలో పాల్గొన్నాడు. ఇక సచిన్ తనయుడు అర్జున్ తెందూల్కర్ కూడా 2013లో ఈ టోర్నీలో ఆడాడు.

గతంలో సింగిల్ ఇన్నింగ్స్​లో అన్ని వికెట్లు (10) పడగొట్టింది వీళ్లే

  • జిమ్ లేకర్ (ఇంగ్లాండ్) vs ఆస్ట్రేలియా - 10/53 (1956)
  • అనిల్ కుంబ్లే (భారత్) vs పాకిస్థాన్ - 10/74 (1999)
  • అజాజ్ పటేల్ (న్యూజిలాండ్) vs భారత్ - 10/119 (2021)

10 పరుగులకే ఆలౌట్- T20 హిస్టరీలో అత్యల్ప స్కోర్ - T20 Lowest Score

4-4-0-1: T20ల్లో సంచలనం- 4ఓవర్లు మెయిడెన్లే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.