ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ మరింత సమర్థంగా ఎదుర్కొవడానికి, ఆ దేశానికి మరిన్ని ప్రత్యేక ఆయుధాలు సరఫరా చేస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ తెలిపారు. అయితే.. ఏ పరికరాలు సరఫరా చేస్తామన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. భారత పర్యటన ముగించుకుకొని పాక్ చేరుకున్న లవ్‌రోవ్.. తన రెండు రోజుల పర్యటనలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి, సైన్యాధిపతి జనరల్ బజ్వాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఫ్గాన్ శాంతి ప్రక్రియలో రష్యా పోషిస్తున్న పాత్రను ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు.
గత 9 ఏళ్లలో ఓ రష్యా విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడమిదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో రష్యా, పాక్ మధ్య గ్యాస్ పైప్‌లైన్‌పైనా చర్చలు జరిగాయి. అఫ్గాన్ శాంతి ప్రక్రియ జరుగుతున్న తీరును కూడా ఇరు దేశాలు సమీక్షించాయి.
ఇదీ చూడండి:'అఫ్గాన్ ఘర్షణల్లో 59 మంది మృతి'