Russia attack Ukraine: ఉక్రెయిన్ విదేశాంగమంత్రి డిమిట్రో కులేబ.. భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్‌కు ఫోన్ చేశారు. మాస్కోతో దౌత్యసంబంధాలను ఉపయోగించి ఎలాగైనా రష్యా తమదేశంపై చేస్తున్న దండయాత్రను ఆపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనుకు ఉద్దేశించిన తీర్మానానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Ukraine India Relations
దౌత్యం, చర్చలే ఏ సమస్యకైనా పరిష్కార మార్గమని కులేబకు జైశంకర్ సూచించారు. భారత్ దీన్నే విశ్వసిస్తుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశం తరలించేందుకు సహకరిస్తున్నందుకు కులేబకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Russia Ukraine War
అంతకుముందు ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 15 సభ్య దేశాల్లో 11 దీనికి మద్దతు తెలిపాయి. భారత్, చైనా, యూఏఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వీటోను ఉపయోగించి రష్యా తీర్మానాన్ని అడ్డుకుంది.
అయితే వివాదాలు పరిష్కారం కావాడానికి చర్చలు మాత్రమే మార్గమని భారత్ తెలిపింది. ఇరు దేశాలు చర్చలు జరిపి శాంతిస్థాపన దిశగా అడుగులు వేయాలని సూచించింది.
ఇదీ చదవండి: 'స్విఫ్ట్' అస్త్రం ప్రయోగిస్తే.. రష్యాకు జరిగే నష్టం ఏంటి?