ETV Bharat / international

కరోనాకు త్వరలోనే రెండో వ్యాక్సిన్​: రష్యా​ - వ్యాక్సిన్​ వార్తలు

ఇప్పటికే స్పుత్నిక్​ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చిన రష్యా.. మరో వ్యాక్సిన్​ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. రెండో వ్యాక్సిన్​ను త్వరలోనే రిజిస్టర్​ చేస్తామని ఆ దేశ పెద్దల సభలో వెల్లడించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. కరోనాతో పాటు కాలానుగుణ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుతు తమ దేశం సిద్ధంగా ఉందని తెలిపారు.

Russia to soon register second vaccine
అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్
author img

By

Published : Sep 24, 2020, 12:00 AM IST

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్​ స్పుత్నిక్​ను అందుబాటులోకి తీసుకొచ్చిన రష్యా.. త్వరలోనే మరో టీకా​ను విడుదల చేయనుంది. తమ దేశం అతిత్వరలో రెండో టీకాను రిజిస్టర్​ చేయనుందని ఆ దేశ ఎగువ సభలో వెల్లడించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​.

వైరస్​ను ఎదుర్కోవడంలో దేశ సామర్థ్యాన్ని అభినందించారు పుతిన్​. కొవిడ్​-19ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉందని వెల్లడించారు.

"త్వరలోనే కరోనాకు రెండో వ్యాక్సిన్​ను రిజిస్టర్​ చేయనున్నాం. మహమ్మారి సమయంలో.. ఆరోగ్య కార్యకర్తల వీరోచిత పోరాటం , దేశం, సమాజం కోసం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పోషించిన కీలక పాత్రను గుర్తించాం. కొద్ది నెలలుగా వారి సామర్థ్యం పెరుగుతూ వస్తోంది. కరోనా మహమ్మారితో పాటు కాలానుగుణ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేందురు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉంది. "

- వ్లాదిమిర్​ పుతిన్​, రష్యా అధ్యక్షుడు.

వెక్టార్​ పరిశోధన కేంద్రం రూపొందించిన 'ఎపివాక్​ కరోనా' అనే వ్యాక్సిన్​ను అక్టోబర్​ 15న రిజిస్టర్​ చేయనున్నట్లు జాతీయ వినియోగదారుల ఆరోగ్య పరిశీలన విభాగం మంగళవారం వెల్లడించింది.

ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్​ 'స్పుత్నిక్​'ను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసింది రష్యా. ప్రస్తుతం వైరస్​ కేసుల పరంగా అమెరికా, భారత్​, బ్రెజిల్​ తర్వాత నాలుగో స్థానంలో ఉంది రష్యా. 11.17 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 19,720 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: ఐరాస సిబ్బందికి ఉచితంగా రష్యా వ్యాక్సిన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.