ETV Bharat / international

'2036 వరకు అధ్యక్షుడిగా పుతిన్'​ బిల్లుకు ఆమోదం - రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరో రెండు దఫాలు కొనసాగేందుకు వీలు కల్పించే బిల్లును ఆ దేశ దిగువ సభ ఆమోందించింది. 2036 వరకు పుతిన్ ప్రెసిడెంట్​గా ఉండేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.

Russia passes bill allowing Putin to run for 2 more terms
'2036 వరకు అధ్యక్షుడిగా పుతిన్'​ బిల్లుకు ఆమోదం
author img

By

Published : Mar 25, 2021, 11:45 AM IST

మరో రెండు పర్యాయాలు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్​ పుతిన్​ను కొనసాగించేందుకు వీలు కల్పించే బిల్లును ఆ దేశ దిగువ సభ (స్టేట్ డ్యూమా) ఆమోదించింది. దీంతో 2024 నుంచి 2 దఫాలు (2036 వరకు) ఆయనే ప్రెసిడెంట్​గా కొనసాగే ప్రక్రియలో మరో ముందడుగు పడినట్లైంది.

ఈ బిల్లును ఫెడరేషన్ కౌన్సిల్(రష్యా ఎగువ సభ) ఆమోదించాల్సి ఉంది. అనంతరం పుతిన్ సంతకంతో అది చట్టంగా రూపుదాల్చుతుంది.

పుతిన్​ ప్రస్తుత ఆరేళ్ల పదవీ కాలం 2024తో ముగియనుంది. దేశాధ్యక్ష పీఠంపై పుతిన్​ 2036 వరకు కొనసాగేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సంస్కరణలను రష్యా ప్రజలు 2020 జులైలో ఆమోదించారు. దాని ప్రకారం పుతిన్ ఇప్పటివరకు 4 సార్లు అధ్యక్ష పదవి చేపట్టిన లెక్క పరిగణనలోకి రాదు.

ఇదీ చూడండి: రష్యా 'నయా' చక్రవర్తి.. వ్లాదిమిర్​ పుతిన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.