ETV Bharat / international

భారత్​లో 'స్పుత్నిక్​' టీకా తయారీకి రష్యా చర్చలు

author img

By

Published : Sep 5, 2020, 5:18 AM IST

కొవిడ్​-19 తొలి వ్యాక్సిన్​ స్పుత్నిక్​-వీని భారత్​లో ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ ఔషధ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది రష్యా. ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపింది.

Sputnik-V coronavirus vaccine
భారత్​లో 'స్పుత్నిక్ టీకా​' ఉత్పత్తి కోసం రష్యా చర్చలు

కరోనా వైరస్​ వ్యాక్సిన్​ స్పుత్నిక్​-వీని భారత్​లో ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ ఔషధ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది రష్యా. ఆ దిశగా పలు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు రష్యా ప్రత్యక్ష పెట్టుబడి నిధి (ఆర్​డీఐఎఫ్​) సీఈఓ కిరిల్​ దిమిత్రివ్​.

ఆర్​డీఐఎఫ్​, గమలేయా ఔషధ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​ స్పుత్నిక్​-వీని ఆగస్టు 11న విడుదల చేసింది రష్యా. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి టీకాగా గుర్తింపు పొందింది. ఈ టీకా మంచి ఫలితాలు ఇస్తోందని ద లాన్సెట్​ జర్నల్​ కథనం ప్రచూరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్​పై ఆశలు రేకెత్తుతున్నాయి.

రష్యాకు చాలా ముఖ్యమైన భాగస్వామి భారత్​. వ్యాక్సిన్​ ఉత్పత్తిలో ముందున్న దేశాల్లో భారత్​ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్లలో 60 శాతం భారత్​లోనే తయారయ్యాయి. స్పుత్నిక్​ -వీ వ్యాక్సిన్​ను భారత్​లో ఉత్పత్తి చేసేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వం, ప్రముఖ ఔషధ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఇప్పటికే ప్రముఖ కంపెనీలతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాం.

- కిరిల్​ దిమిత్రివ్​, ఆర్​డీఐఎఫ్​ సీఈఓ

స్వదేశీ మార్కెట్​తో పాటు ఇతర దేశాల కోసం కూడా వ్యాక్సిన్​ ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్​కు ఉందని గుర్తించినట్లు తెలిపారు కిరిల్​​. రష్యా వ్యాక్సిన్​ పనితీరుపై భారత భాగస్వామ్య సంస్థలు అవలంబించిన సమతుల్య విధానాన్ని అభినందిస్తున్నామని తెలిపారు. మా వ్యాక్సిన్​పై విమర్శలు చేయకుండా.. అర్థం చేసుకునే ప్రయత్నం చేశారని కొనియాడారు.

ఇదీ చూడండి: గుడ్​న్యూస్​: రష్యా 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్ సేఫ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.