Russia Corona Cases: రష్యాలో కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత నెలతో పోల్చితే ప్రస్తుతం కేసుల సంఖ్య పది రెట్లు పెరిగింది. జనవరిలో 17,000 నమోదైన కేసులు.. తాజాగా ఆదివారం 1,89,071 కేసులు వెలుగులోకి వచ్చాయి. క్రితం రోజు కంటే 2,800 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. అయితే.. కేసులు పెరిగినప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం నిలకడగానే ఉందని ఆ దేశ ఆరోగ్య విభాగం వెల్లడించింది. ఆదివారం 661 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
రష్యాలో మొత్తం 1,28 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 3,35,414 కరోనా మరణాలు సంభవించాయి. స్పుత్నిక్- వి టీకాను 12-17 ఏళ్లలోపు పిల్లలకు కూడా పంపిణీ చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్డౌన్ను విధించే యోచనలేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే వెల్లడించారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా యుద్ధ విమానాలు!