ETV Bharat / international

లీటర్ వాటర్ బాటిల్ రూ.3వేలు.. ప్లేటు భోజనం రూ.7500! - Taliban viral videos

వాటర్ బాటిల్ ధర ఎంతుంటుంది? రూ.20, మరీ కాస్ట్​లీ అయితే రూ.50 అంటారా? మరి ఒక లీటర్​ బాటిల్ కోసం రూ.3000 వెచ్చించాల్సి వస్తే? అదే ఒక ప్లేటు భోజనం రూ.7500 అంటే? కానీ అత్యవసర వస్తువులకు విపరీతమైన ధరలు పెట్టి ప్రజలను దోచుకుంటున్న దృశ్యాలు కాబూల్ విమానాశ్రయంలో కనిపిస్తున్నాయి.

afgan taliban
afgan taliban
author img

By

Published : Aug 27, 2021, 6:49 PM IST

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి వారి పాలన నుంచి తప్పించుకునేందుకు వేల మంది అఫ్గాన్‌లు దేశం విడిచి పారిపోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అనేక మంది ఇప్పటికే విమానాల్లో ఇతర దేశాలకు వలసవెళ్లారు. తమకు కూడా అవకాశం రాకపోతుందా అనే ఆశతో విమానాశ్రయంలోనే చాలామంది నిరీక్షిస్తున్నారు. ఈ పరిణామాలను కొందరు వ్యాపారస్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. విమానాశ్రయంలో ఆహారం, నీళ్లు, శీతలపానీయాల ధరలను ఊహించని విధంగా పెంచేశారు. అమాంతంగా పెరిగిపోయిన ధరలతో ఆకలికి అల్లాడుతున్నారని ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రచురించింది.

'ప్లేట్ భోజనానికి 100 డాలర్లు(సుమారు రూ.7500), లీటర్ మంచినీళ్ల బాటిల్​కి రూ.3,000, చెల్లించాల్సి వస్తోంది. దుకాణదారులు అఫ్గానీ కరెన్సీకి బదులు డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలను దోపిడీ చేస్తున్నారు. అసమాన ధరల వల్ల ప్రజలు ఆకలితో ఎండలోనే నిలబడాల్సిన దుస్థితి నెలకొంది,' అని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.

అమెరికా దళాల ఉపసంహరణకు ముందే.. ఆగస్టు 15న అఫ్గాన్​ను తాలిబన్లు ఆక్రమించారు. ఈ గడువు(ఆగస్టు 31) దగ్గర పడుతున్నందున ప్రజలు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని కోరుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.