పాకిస్థాన్ కుర్రమ్ జిల్లా పరచినార్లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో ఇంటిపైకప్పు కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన 20మందిని ఆసుపత్రికి తరలించామన్నారు.