చిన్నతనంలో మీరు రుపాయి నాణెం పొరపాటున మింగేశారా? అందులో విచిత్రం ఏముంది.. మెడపైన రెండు దెబ్బలు కొడితే బయటకొస్తుంది కదా అనుకుంటున్నారా! కానీ చైనాలో ఓ పిల్లాడు ఉంగరాన్ని మింగేశాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది బాలుడి తల్లి. అరగంటలో ఆ ఉంగరాన్ని బాలుడి కడుపులో నుంచి బయటకు తీశారు వైద్యులు .
"అమ్మా నీ ఉంగరం బాగుంది నాకు కావాలి అని అడిగాడు. ఆడుకుంటాడులే అని ఇచ్చాను. అమ్మా నేను దీన్ని మింగేస్తున్నాను అంటూ భయపెట్టాడు. వారించేలోపే పొరపాటున నోట్లోకి వెళ్లిపోయింది ఉంగరం" - ఝాంగ్, బాలుడి తల్లి
ఆసుపత్రిలో బాలుడిని పరీక్షించిన వైద్యులు వెంటనే సిటీ స్కాన్ చేశారు. కడుపులో ఉంగరం ఎక్కడుందో కనిపెట్టి దాన్ని బయటకు తీశారు. ఈ మొత్తం ప్రక్రియ కేవలం అరగంటలో పూర్తిచేశారు వైద్యులు.