ETV Bharat / international

ఐరాస విజ్ఞప్తి బేఖాతరు- పది మంది కాల్చివేత

author img

By

Published : Mar 11, 2021, 6:42 PM IST

మయన్మార్​లో ప్రజాస్వామ్యవాదులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ప్రజలపై దాడులను ఆపాలని ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే పది మంది ఆందోళనకారుల్ని కాల్చి చంపింది.

Rights group: Myanmar military using systematic deadly force
ఐరాస విజ్ఞప్తి బేఖాతరు.. పది మంది కాల్చివేత

సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న ప్రజలపై దాడులు మానుకోవాలని ఐక్యరాజ్య సమితి చేసిన విజ్ఞప్తిని సైన్యం పెడచెవిన పెట్టింది. గురువారం నాడు 10 మందిని కాల్చి చంపింది.

మయన్మార్​లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం సమావేశమైంది. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న ప్రజలపై అణచివేత ధోరణిని వెంటనే ఆపాలని విజ్ఞప్తిచేసింది. కానీ మరుసటి రోజే మయన్మార్​ సైన్యం పది మంది ప్రజల్ని కాల్చి చంపింది.

ఆందోళన చేస్తోన్న ప్రజలపై సైన్యం రబ్బరు బులెట్లను, టియర్​ గ్యాస్​ను ప్రయోగిస్తోందని, కాల్పులకు తెగబడుతోందని మానవ హక్కుల సమితి అమ్నెస్టీ ఇంటర్​నేషనల్​ ఆరోపించింది. కాగా సైన్యం జరిపిన దాడుల్లో 60మంది వరకు చనిపోయారని మయన్మార్​లోని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చూడండి: 'మయన్మార్​ సైన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.