ETV Bharat / international

సైనిక నియంత్రణలో మయన్మార్​- సూకీ గృహ నిర్బంధం

మయన్మార్​లో సైనిక తిరుగుబాటు జరిగింది. దేశం తమ నియత్రణలో ఉందని సైన్యం ప్రకటించింది. మయన్మార్​ అధినేత్రి, నేషనల్​ లీగ్ ఫర్​​ డెమొక్రసీ నాయకురాలు ఆంగ్​ సాన్​ సూకీని సైన్యం గృహ నిర్బంధంలో ఉంచింది. రాజధాని నేపిడాలో ఫోన్​, ఇంటర్​నెట్​ సేవలు రద్దు చేసింది.

Reports: Military coup in Myanmar, Suu Kyi detained
మయన్మార్​లో సైనిక తిరుగుబాటు- సూకీ గృహ నిర్బంధం
author img

By

Published : Feb 1, 2021, 7:30 AM IST

Updated : Feb 1, 2021, 8:58 AM IST

మయన్మార్​ కీలకనేత ఆంగ్​ సాన్​ సూకీని ఆ దేశ సైన్యం గృహనిర్బంధంలో ఉంచినట్లు సమాచారం. సూకీ సహా అధికార నేషనల్ లీగ్ ఫర్​ డెమొక్రసీ(ఎన్​ఎల్​డీ) పార్టీ చైర్మన్​ను సోమవారం ఉదయం సైన్యం అదుపులోకి తీసుకునట్లు మయన్మార్​ మీడియా తెలిపింది. రాజధాని నేపిడాలో టెలిఫోన్​, ఇంటర్​నెట్​ సేవలు నిలిపివేశారని పేర్కొంది. ఎన్ఎల్​డీ పార్టీ నాయకులతో ఫోన్​లో మాట్లాడే వీలు లేదని చెప్పింది.

అనంతరం మయన్మార్ ఇప్పుడు పూర్తిగా తమ నియంత్రణలో ఉందని సైన్యం ప్రకటించింది. ఏడాదిపాటు పాలన తమ నియంత్రణలోనే ఉంటుందని ఆర్మీ అధికారిక మీడియా ద్వారా వెల్లడించింది.

గతేడాది జరిగిన ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు మయన్మార్​ చట్టసభ్యులు సోమవారం నేపిడాలో సమావేశం కావాల్సి ఉంది. ఈ ఎన్నికలు అక్రమంగా జరిగాయని సైనిక తిరుగబాటు తప్పదని మిలిటరీ అధికారులు కొద్ది రోజుల క్రితమే హెచ్చరించారు.

నవంబర్​లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూకీ పార్టీ 476 స్థానాలకు గానూ, 396 స్థానాలు కైవసం చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. దశబ్దాల సైనిక పాలన నుంచి విముక్తి కల్పిస్తూ 2015లో తొలిసారి గెలిచారు.

అమెరికా హెచ్చరిక..

మయన్మార్​లో పరిస్థితులకు నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ప్రజాస్వామ్య పరివర్తనను అణగదొక్కడానికి మయన్మార్​ సైన్యం ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రకటనలో పేర్కొంది. నిర్బంధంలో ఉంచిన సూకీ, ఇతర నాయకులను విడుదల చేయాలని సైన్యానికి సూచించింది. ప్రజాస్వామ్య సంస్థలకు తమ మద్దతు ఉంటుందని చెప్పింది.

Last Updated : Feb 1, 2021, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.