ETV Bharat / international

'స్పుత్నిక్‌ తయారీకి కేంద్ర బిందువుగా భారత్‌'

స్పుత్నిక్-వి​ టీకా డోసులకు కొరత ఏర్పడిందన్న వార్తలను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్ ఖండించింది. సెప్టెంబర్‌ నుంచి భారీ స్థాయిలో తమ టీకాలు.. భారత్​లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో స్పుత్నిక్‌ తయారీకి భారత్‌ కేంద్ర బిందువుగా మారనుందని పేర్కొంది.

sputnik vaccine
స్పుత్నిక్​ టీకా
author img

By

Published : Aug 1, 2021, 7:29 AM IST

స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను సెప్టెంబర్‌ నుంచి భారత్‌లో భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే అవకాశాలున్నట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్​డీఐఎఫ్​) వెల్లడించింది. దీంతో స్పుత్నిక్‌ తయారీకీ భారత్‌ అతిపెద్ద కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. రెండో డోసు కొరత ఉందంటూ వస్తున్న నివేదికలు ఆవాస్తవమని.. అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి భారత్‌ ఇదివరకే అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ ప్రస్తుతం ప్రైవేటులోనే ఎక్కువగా అందుబాటులో ఉంది.

"రెండో డోసు కొరత ఏర్పడిందని.. దీంతో తొలిడోసు తీసుకున్న వారికి ఆలస్యం అవుతోందనే నివేదికల్లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌, గ్లాండ్‌ ఫార్మా, హెటెరో బయోఫార్మా, పనేషియా బయోటెక్‌, స్టెలిస్‌ బయోఫార్మా, విర్కౌ బయోటెక్‌తో పాటు మోర్పెన్‌ ల్యాబ్‌లు స్పుత్నిక్‌ తయారీకి సన్నాహాలు చేస్తున్నాయి. సెప్టెంబర్‌ నుంచి భారీ స్థాయిలో టీకాలు అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో స్పుత్నిక్‌ తయారీకి భారత్‌ కేంద్ర బిందువుగా మారనుంది."

-ఆర్​డీఐఎఫ్​

స్పుత్నిక్‌తో పాటు సింగిల్‌ డోసులో రూపొందించిన 'స్పుత్నిక్‌ లైట్‌'ను ఆగస్టులోనే భారత్‌కు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్‌డీఐఎఫ్‌ ప్రకటించింది. అయితే, రష్యాలో వైరస్‌ తీవ్రత పెరుగుతున్నందున భారత్‌కు దిగుమతికి ఆలస్యం ఏర్పడుతోందని డాక్టర్‌ రెడ్డీస్‌ ఈ మధ్యే పేర్కొంది. ఆగస్టు చివరినాటికి ఈ పరిస్థితులు చక్కబడతాయని వెల్లడించింది. ఇదే సమయంలో సెప్టెంబర్‌ నుంచి భారత్‌లో స్పుత్నిక్‌ భారీ ఎత్తున అందుబాటులో వస్తుందని ఆర్‌డీఐఎఫ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి: చైనాలో మరిన్ని ప్రాంతాలకు డెల్టా ముప్పు

ఇదీ చూడండి: కరోనాతో పారా హుషార్.. టీకా వేసుకున్నా మాస్క్ తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.