ఇండోనేసియాలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తూర్పు జావా రాష్ట్రం గంజుక్ జిల్లా సెలోపురో గ్రామంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది ఆచూకీ గల్లంతైనట్లు విపత్తు నిర్వాహక అధికారులు తెలిపారు.
ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గంజుక్ గ్రామంలో ఆదివారం 8ఇళ్లు నీటిలో మునిగిపోయినట్లు చెప్పారు. 21మంది వరదలో చిక్కుకోగా.. పలువురిని కాపాడినట్లు తెలిపారు అధికారులు. రెండు మృతదేహాలు లభ్యమవగా.. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి : అమెరికాను బెంబేలెత్తిస్తున్న హిమపాతం