ETV Bharat / international

Afghan Taliban: అఫ్గాన్​ భవితవ్యాన్ని తేల్చేది ఈ 10 ప్రశ్నలే! - international news in telugu

అఫ్గానిస్థాన్​(Afghanistan News) ఇక తాలిబన్ల రాజ్యంగా మారబోతోంది. 20 ఏళ్లుగా సాగుతున్న యుద్ధం నుంచి వైదొలిగి అమెరికా ఆ దేశాన్ని విడిచి వెళ్లింది. దీంతో తాలిబన్లు(Afghan Taliban) పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కాబుల్ విమానాశ్రయాన్ని కూడా పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అయితే తాలిబన్లు అధికారం చేపట్టాక అక్కడి ప్రజల పరిస్థితి ఏంటి? ప్రపంచ దేశాలు వారి పాలనను గుర్తిస్తాయా? భారత్​తో అఫ్గాన్ సంబంధాలు మునుపటిలా సాధారణంగా ఉంటాయా? తాలిబన్ల వైఖరి ఎలా ఉండబోతోంది? అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

questions raising about Afghan future under taliban rule after us nato forces leave the country
తాలిబన్ల పాలనలో అఫ్గాన్​ భవిష్యత్​ ఏంటి?
author img

By

Published : Aug 31, 2021, 2:48 PM IST

అఫ్గానిస్థాన్ పూర్తిగా తాలిబన్ల హస్తగతమైంది(Afghan Taliban). అనుకున్న డెడ్​లైన్​కు(ఆగస్టు 31) ముందే అమెరికా బలగాలు ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి. 20 ఏళ్లుగా సాగుతున్న యుద్ధానికి తెరదించాయి(us troops leave afghanistan). దీంతో తాలిబన్లు సంబరాల్లో మునిగిపోయారు. రెండు దశాబ్దాల తమ కల నెరవేరిందని ఆనందపడుతున్నారు. అయితే తాలిబన్ల పాలనలో అఫ్గాన్ భవితవ్యంపై(​(Afghanistan News)) ప్రధానంగా 10 ప్రశ్నలు ఉతన్నమవుతున్నాయి.

1. నెక్స్ట్ ఏంటి?

అఫ్గాన్​ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని అధికారికంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. తమ పాలనా విధానాలు(Taliban Rule in Afghanistan) ఎలా ఉంటాయో ప్రపంచానికి, అఫ్గాన్​ ప్రజలకు వెల్లడించాలి. 1990 నాటిలా తమ పరిపాలన ఉండదని, అందరికీ సమాన హక్కులు కల్పిస్తామని తాలిబన్లు చెబుతున్నా.. అవి అమలుకు నోచుకుంటాయో లేదో కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరంటే భయంతో వణికిపోతున్న ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.

2. అమెరికా మాటేంటి?

తాలిబన్లు ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ పాలనను ప్రపంచ దేశాలు సమ్మతించేలా నడుచుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ స్పష్టం చేశారు. అఫ్గాన్ ప్రజల ప్రాథమిక హక్కులను గౌరవించేలా, మహిళలు, మైనారిటీల హక్కులు కాపాడేలా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసేలా తాలిబన్ల ప్రభుత్వం ఉండాలన్నారు. అఫ్గాన్ ప్రజలు ఇతర దేశాలకు ప్రయాణించేందుకు, దేశం వీడేందుకు అనుమతించాలని చెప్పారు. వీటన్నింటినీ సరిగ్గా అమలు చేస్తేనే అఫ్గాన్​తో సంబంధాలపై అమెరికా ఆలోచిస్తుందని(us on afghanistan) తేల్చి చెప్పారు. అంతేకాకుండా కాబుల్​లోని తమ దౌత్య కార్యాలయన్ని మూసివేసి ఖతార్​లోని దోహకు తరలించినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి దౌత్య కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు.

అఫ్గాన్​లో ఇంకా 200 మంది అమెరికా పౌరులు, దేశాన్ని వీడాలనుకుంటుకున్న వేల మంది ఉన్నారు. వీరందరినీ తరలించే ప్రయత్నాలను కొనసాగిస్తామని బ్లింకెన్ చెప్పారు. తాలిబన్లు కూడా ఇందుకు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

3. ఐరాస భద్రతా మండలి డిమాండ్లేంటి?

తాలిబన్లు కాబుల్​ను హస్తం చేసుకున్న తర్వాత భారత్ నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ) బలమైన తీర్మానాన్ని ఆమోదించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గాన్ కేంద్రం కాకూడదని, ఇతర దేశాలను బెదిరించేందుకు ఈ భూభాగాన్ని ఎవరూ ఉపయోగించకూడదని అందులో పేర్కొంది. యూఎన్​ఎస్​సీలో మొత్తం 15 సభ్య దేశాలుండగా.. 13 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. రష్యా, చైనా మాత్రం వీటో హక్కును వినియోగించుకుని ఓటింగ్​గు దూరంగా ఉన్నాయి.

కాబుల్ విమానశ్రయం(Kabul Airport) వద్ద ఆగస్టు 26న జరిగిన జంట పేలుళ్ల ఘటనను యూఎన్​ఎస్​సీ తీవ్రంగా ఖండించింది.

4. ప్రపంచదేశాలు తాలిబన్ల పాలనను గుర్తిస్తాయా?

అఫ్గాన్​లో తాలిబన్ల పాలనను(Afghanistan Taliban) ఇప్పట్లో గుర్తించే ప్రసక్తే లేదని అమెరికా తేల్చి చెప్పింది. దాని మిత్ర దేశాలది కూడా ఇదే మాట అని స్పష్టం చేసింది. అఫ్గాన్ నిధులపై కూడా ఆంక్షలు విధించింది. అయితే రష్యా, చైనా మాత్రం తాలిబన్లతో సంప్రదింపులు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. కాబుల్​లోని తమ దౌత్య కార్యాలయాలను కూడా తెరిచే ఉంచాయి. తాలిబన్ల ప్రభుత్వంతో సాధారణ సంబంధాలు నెలకొల్పే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు రష్యా అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి జమిర్ కబులోవ్​ వెల్లడించారు. ఎలాంటి ఆంక్షలు విధించే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. అఫ్గాన్ ప్రజల సంస్కృతి మత సంప్రదాయాలను గౌరవిస్తామన్నారు. అయితే అఫ్గాన్​లో సైనిక, రాజకీయ పరిస్థితిపై మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు.

అప్గానిస్థాన్​లో అమెరికా మరోసారి వైమానిక దాడులు(US Airstrike in Afghan) నిర్వహించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని కబులోవ్ అభిప్రాయపడ్డారు. అఫ్గాన్​లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుక పశ్చిమ దేశాలు సహకరించాలున్నారు. అఫ్గాన్​ నిధులపై అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఆ దేశానికి మరిన్ని కష్టాలు తెచ్చినట్లేనని అభిప్రాయపడ్డారు. తమవంతు సాయంగా అఫ్గాన్​కు అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధమని స్పష్టం చేశారు.

5. భారత్​పై తాలిబన్ల వైఖరి ఎలా ఉండబోతుంది?

భారత్​తో తాము స్నేహసంబంధాలే కోరుకుంటున్నట్లు తాలిబన్లు(Taliban on India) ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను యథావిధిగా కొనసాగించాలని భావిస్తున్నట్లు తాలిబన్ల నాయకుడు షేర్ మహమ్మద్​ స్తానెక్​జాయ్ తెలిపారు. ఆసియా ఉపఖండంలో భారత్​ అత్యంత కీలకమైన దేశమని స్పష్టం చేశారు.

6. తాలిబన్ల పట్ల భారత్ వైఖరేంటి?

అఫ్గాన్​లో తాలిబన్ల పాలనను గుర్తించే విషయమై భారత్​ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ అంశం వేచి చూసే ధోరణి అవలంబించాలని భావిస్తోంది. అఫ్గాన్​లో పరిస్థితిపై ఇటీవలే అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుంది.

అయితే భారత్​ పట్ల తాలిబన్లు సానుకూల దృక్పథంతో ఉండటానికి మరో కారణం ఉందని మాజీ రాయబారి జితేంద్ర త్రిపాఠి తెలిపారు. తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్​ అధికారికంగా గుర్తిస్తే దానివల్ల ఎంత ప్రయోజనమో వారికి తెలుసు అని వివరించారు. మిగతా దేశాలు కూడా తాలిబన్లపై మంచి అభిప్రాయాన్ని ఏర్పరుచుకుని సంబంధాలు కొనసాగించడానికి ముందుకు వస్తాయని, అందుకే భారత్​ను ఒక గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవాలని తాలిబన్లు భావించవచ్చని విశ్లేషించారు.

ఒకవేళ తాలిబన్లు అఫ్గాన్​లో భారత్​ పెట్టిన పెట్టుబడులకు, తమ పౌరులకు ఎలాంటి హాని తలపెట్టబోమని హామీ ఇస్తే.. కేంద్రం వారితో సంప్రదింపులు జరపవచ్చని త్రిపాఠి అభిప్రాయపడ్డారు. తాలిబన్ల ప్రకటనపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించనప్పటికీ.. వారి సందేశాన్ని తీవ్రంగా పరిశీలించాలన్నారు. తాలిబన్లతో భారత్​ సంప్రదింపులు జరుపుతన్నప్పటికీ బహిరంగంగా ఏ విషయాలు వెల్లడించొద్దని సూచించారు.

2018 నుంచే తాలిబన్లతో భారత్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంప్రదింపులు జరుపుతోందని త్రిపాఠి వెల్లడించారు. ఈ ఏడాది మొదట్లో నేరుగా సంప్రదించినట్లు చెప్పారు. ఇరాన్, దోహ సహా ఇతర దేశాల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జరిపిన పర్యటనలను ప్రస్తావించారు. ప్రభుత్వం తాలిబన్లతో చర్చలు జరిపినప్పటికీ ఈ విషయాలను బహిరంగంగా ప్రకటించలేదని, అది విధానపరమైన అంశమని వివరించారు.

7. అఫ్గాన్ మహిళల పరిస్థితి?

తాలిబన్ల రాజ్యం వస్తే తమ హక్కులను కాలరాస్తారని(Afghan Women Rights) అఫ్గాన్ మహిళలు ఇప్పటికే భయంతో వణికిపోతున్నారు. అందుకు తగ్గట్టే తాలిబన్ల చర్యలు కూడా ఉన్నాయి. అధికారికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే వారు మహిళలపై ఆంక్షలు విధిస్తున్నారు. దేశంలో కో-ఎడ్యుకేషన్​ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు మగ టీచర్లు మాత్రమే బోధించాలని షరతు పెట్టారు. టీవీ, రేడియో ఛానళ్లలో మహిళలు పాడకూడదని హుకుం జారీ చేశారు. మహిళల సంగీత కళాశాలలను మూసివేశారు. వంట రుచిగా చేయలేదని ఓ మహిళ ఒంటికి నిప్పంటించి 1990నాటి తమ అరాచక పాలనను మళ్లీ గుర్తు చేశారు. దీంతో తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని అఫ్గాన్ మహిళలలు కలత చెందుతున్నారు. మహిళల హక్కులు కాపాడతామని తాలిబన్లు హమీ ఇచ్చినా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.

8. భయం పోయిందా?

గత 20 ఏళ్లలో అఫ్గాన్ సాధించిన పురోగతి అమెరికా, నాటో దళాలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా కనిపిస్తోంది. మంగళవారం ఉదయం కాబుల్​లో అనేక మంది బాలురు, బాలికలు పాఠశాలకు తరలివెళ్లారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన తర్వాత ఎక్కువ సందడి కనిపించింది. 'నాకు తాలిబన్లు అంటే భయం లేదు' అని ఓ ప్రైవేటు స్కూల్​లో ఐదో తరగతి చదువుతున్న బాలిక మసూద తెలిపింది.

అఫ్గాన్​లో ఇక నుంచి బాలురు, బాలికలకు వేర్వేరుగా తరగతులు నిర్వహించాలని తాలిబన్లు ప్రకటించారు. అయితే కొన్ని స్కూళ్లలో ఈ నిబంధన ఇప్పటికే అమలులో ఉంది.

9. పిల్లల దయనీయ పరిస్థితి మారుతుందా?

అఫ్గాన్​లో దాదాపు కోటి మంది చిన్నారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అక్కడి యూనిసెఫ్ ప్రతినిధి ఆందోళకర విషయాన్ని వెల్లడించారు. అఫ్గాన్​ సంక్షోభానికి అసలు సంబంధం లేని వారే ఇప్పుడు బాధితులుగా మారారని పేర్కొన్నారు. గత గురువారం నుంచి కాబుల్​లో పిల్లలపై అనేక దాడులు జరుతున్నాయని తెలిపారు. ఎంతో మంది చిన్నారులు తోడు, నీడ లేక ఒంటరివారయ్యారాని చెప్పారు.

గత ఏడాదిలో అఫ్గాన్ వ్యాప్తంగా జరిగిన హింసలో 550మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, 1400మందికిపైగా పిల్లలు క్షతగాత్రులయ్యారని యూనిసెఫ్ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు కనీసం, ఆహారం నీరు అందడం లేదని చెప్పారు. పోలియో సహా, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లు పిల్లలకు అందడం లేదని వాపోయారు.

అఫ్గాన్​ను తాలిబన్లు అధీనంలోకి తెచ్చుకున్న తొలిసారి ఐరాస కీలక ఔషధాలకు ఆ దేశానికి విమానం ద్వారా సరఫరా చేసింది. షిప్​మెంట్ విజయవంతంగా పూర్తయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆరోగ్య సేవలు కొనసాగిస్తామని పేర్కొంది.

తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశాక అఫ్గాన్​లో చిన్నారుల పరిస్థితి మారుతుందో లేదో చూడాలి.

10. అఫ్గాన్​లో ఇతరుల పరిస్థితి ఏంటి?

దాదాపు అన్ని దేశాలు తమ పౌరులను స్వదేశానికి తరలించామని ప్రకటించినా.. ఇంకా కొంత మంది అక్కడే ఉన్నారు. అమెరికాకు చెందిన వారు దాదాపు 200మంది ఉన్నారని అంచనా. అలాగే అఫ్గాన్​ను వీడి ఇతర దేశాలకు వెళ్లాలనుకునేవారు వేల మంది ఉన్నారు. వీరందరినీ తరిలించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తెలిపారు. తాలిబన్లు ఇందుకు సహరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.

అఫ్గాన్ ప్రజలు, ఇతర దేశస్థులు తమ ఇష్టం మేరకు ఏ సరిహద్దు నుంచైనా, విమాన, సముద్ర మార్గాల్లోనైనా వేరే దేశాలకు వెళ్లవచ్చని తాలిబన్లు చెప్పారు. కానీ అధికారం చేపట్టాక అందుకు అనుమతిస్తారో లేదో చూడాలి.

ఇవీ చదవండి: Afghan Taliban: 'అఫ్గాన్​కు పూర్తి స్వాతంత్య్రం'.. సంబరాల్లో తాలిబన్లు

Afghanistan Journalist: అఫ్గాన్‌ను వీడిన 'ఆమె'..!

Afghan Crisis: చైనా చిలుక పలుకులు- తాలిబన్లకు 'దారి' చూపాలట!

Afghan Crisis: పెనం పై నుంచి పొయ్యిలోకి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.