జపాన్ వేదికగా 14వ జీ20 సదస్సు జరుగుతోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేక దేశాధ్యక్షులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఎన్నో దేశాల మధ్య ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. వీటి మధ్య ఓ 'మగ్' అందరిని ఆకర్షిస్తోంది. అదే అధికారిక విందులో రష్యా అధ్యక్షుడు వినియోగించిన తెలుపు రంగు మగ్.
ఎవరిపైనా నమ్మకం లేకే...?
జీ20 సదస్సుకు పుతిన్ తన సొంత మగ్ తెచ్చుకున్నారు. అధికారిక విందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కన కూర్చున్న 66 ఏళ్ల పుతిన్... తెలుపు రంగు మగ్ను పట్టుకుని కనబడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సొంత మగ్ను పుతిన్ వినియోగించడంపై కొందరు చురకలు అంటిస్తుంటే... రష్యా అధ్యక్షుడికి ఎవరిపైనా నమ్మకం లేదని మరికొందరు విమర్శిస్తున్నారు.
ఈ విషయంపై ఓ రష్యా ప్రతినిధి స్పందించారు. ఆ మగ్లోనే పుతిన్ నిత్యం టీ తాగుతారని వెల్లడించారు.
జీ20 సదస్సు శనివారంతో ముగియనుంది. ట్రంప్, బ్రిటన్ ప్రధాని థెరెసా మే సహా పలువురు నేతలతో పుతిన్ శుక్రవారం చర్చలు జరిపారు.
ఇదీ చూడండి:- టీమిండియా ఆరెంజ్ జెర్సీ ఇదే..