అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లకు, అక్కడి భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరును చిత్రీకరించేందుకు వెళ్లిన ప్రముఖ భారతీయ జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు. కాందహార్ రాష్ట్రంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని భారత్‌కు అఫ్గానిస్థాన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ప్రముఖ రాయిటర్స్ వార్తా సంస్థలో ఫొటో జర్నలిస్టుగా పని చేస్తున్నారు సిద్ధిఖీ. అఫ్గాన్‌లో తాలిబన్లు, సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణలు, పరిస్థితిని చిత్రికరించేందుకు వారం రోజులుగా ఆయన కాందహార్‌లోనే ఉంటున్నారు.
ముంబయికి చెందిన 40 ఏళ్ల సిద్ధిఖీ రాయిటర్స్ వార్తా సంస్థ తరఫున పులిట్జర్ అవార్డు గెలుచుకున్నారు.
ఇదీ చూడండి: మంటల్లో చిన్నారి- ఆ తల్లి ఎలా కాపాడుకుందంటే?