ETV Bharat / international

చైనా బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్​లో నిరసనలు - హాంగ్​కాంగ్​ వార్తలు

చైనా జాతీయ గీతాన్ని దుర్వినియోగం చేయడాన్ని నేరంగా పరిగణించే బిల్లును వ్యతిరేకిస్తూ హాంకాంగ్​లో నిరసనకారులు ఆందోళనకు దిగారు. అల్లర్లను అడ్డుకునే క్రమంలో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

Protesters mass in Hong Kong as anthem law is debated
చైనా బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్​లో నిరసనలు
author img

By

Published : May 27, 2020, 7:18 PM IST

హాంకాంగ్​లో మరోసారి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. చైనా జాతీయ గీతాన్ని దుర్వినియోగం చేయడాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు సంబంధించి చట్టసభ సభ్యులు చర్చలు జరుపుతుండగా.. హాంకాంగ్​లో వేలాది మంది నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అసెంబ్లీ సమావేశానికి ముందు.. శాసనసభ భవనం వెలుపల పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వీరిని నిలువరించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు.

కాజ్​వే బేయ్​ జిల్లాలోని ఓ షాపింగ్​మాల్​ ఎదుట సుమారు 50 మందికిపైగా నిరసన చేస్తుండగా... పోలీసులు పెప్పర్​ స్ప్రేను ప్రయోగించారు. విధుల్లో ఉన్న పాత్రికేయులను కూడా అడ్డుకున్నారు. అనధికారికంగా గుమిగూడిన సుమారు 300 మందిని అరెస్ట్​ చేసినట్లు హాంకాంగ్​ పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాసోలిన్​ బాంబులు కలిగి ఉన్న మరో 17 మంది యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

చైనా బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్​లో నిరసనలు

జాతీయగీతాన్ని అవమానపరిస్తే అంతే..

సెమీ స్వయం ప్రతిపత్తి కలిగిన దేశమైన హాంకాంగ్​లో చైనా జాతీయ గీతం 'మార్చ్​ ఆఫ్​ ద వలంటీర్స్​'ను అవమానించడం, దుర్వినియోగ పరచడాన్ని తాజాగా తీసుకొచ్చిన బిల్లు వ్యతిరేకిస్తుంది. ఈ నేరానికి పాల్పడిన వారికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు.. 50 వేల హాంకాంగ్​ డాలర్లు జరిమానాగా విధిస్తారు. గతేడాది ఫుట్​బాల్​ ప్రపంచకప్​ క్వాలిఫైయింగ్​ గేమ్​లో అభిమానులు జాతీయగీతాన్ని అవమానపరచడం వల్ల.. హాంకాంగ్​ ఫుట్​బాల్​ అసోసియేషన్​కు జరిమానా విధించింది ఫిఫా.

ఇదీ చదవండి: ముదురుతున్న భారత్​-చైనా వివాదం.. మరో డోక్లాం అయ్యేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.