ETV Bharat / international

'నేపాల్​లో రాజకీయ సంక్షోభానికి త్వరలోనే తెర'

నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ త్వరలోనే రాజకీయ స్థిరత్వాన్ని సాధిస్తుందని నమ్ముతున్నట్లు చైనా పేర్కొంది. రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు గువో బృందం నేపాల్​లో పర్యటిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Properly handle differences, China tells Oli and Prachanda
'నేపాల్​లో రాజకీయ సంక్షోభం త్వరలోనే తొలిగిపోతుంది'
author img

By

Published : Dec 28, 2020, 8:39 PM IST

సరైన చర్యల ద్వారా రాజకీయ అనిశ్చితికి తెరదించాలని నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ(ఎన్​సీపీ) నేతలను చైనా కోరింది. ఇందుకోసం.. చైనా ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం కృషి చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే నేపాల్​లో సంక్షోభం సద్దుమణుగుతుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్​ వెల్లడించారు.

"ఒక మిత్రునిలా నేపాల్​లో త్వరలోనే రాజకీయ అనిశ్చితి తొలిగిపోతుందని ఆశిస్తున్నాం. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ వర్గాలు అంతర్గత విభేదాలను పరిష్కరించుకుంటాయని, రాజకీయ స్థిరత్వాన్ని సాధిస్తాయని నమ్ముతున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, పరస్పర గౌరవ సూత్రాలను చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ ) సమర్థిస్తుంది. నేపాల్​, చైనాల మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహబందం ఉంది."

-- జావో లిజియాన్​, చైనా విదేశాంగ ప్రతినిధి

నేపాల్​లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ఆరా తీసేందుకు చైనా నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఆదివారం ఉదయం కాఠ్​మాండుకు చేరుకుంది. నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలీ, ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​ ప్రచండ వర్గం నేతలతో సంప్రదింపులు జరుపుతోంది.

ఇదీ చూడండి:నేపాల్​ అగ్రనేతలతో చైనా బృందం భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.