ETV Bharat / international

'భారత విదేశీ విధానంలో బంగ్లాదేశ్​కు సముచిత స్థానం'

author img

By

Published : Mar 4, 2021, 8:34 PM IST

ప్రధాని మోదీ చేపట్టబోయే బంగ్లాదేశ్ పర్యటన చిరస్మరణీయంగా నిలిచిపోతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. భారత్​ను ఆ దేశం విలువైన భాగస్వామిగా పరిగణిస్తోందని చెప్పారు. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకునే అనువైన సంబంధాలు ఇరుదేశాల మధ్య ఉన్నాయన్నారు.

Prime Minister Modi's visit to Bangladesh will be a very memorable one: Jaishankar
'మోదీ బంగ్లాదేశ్ పర్యటన చిరస్మరణీయమే'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల చివర్లో చేపట్టే బంగ్లాదేశ్ పర్యటన చిరకాలం గుర్తుండిపోతుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య 360 డిగ్రీల భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. ఒకరోజు పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్​కు వెళ్లిన ఆయన.. ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమిన్​తో చర్చలు జరిపారు. 'పొరుగు దేశాలకు ప్రాధాన్యం' అనే భారత విదేశాంగ విధానంలో బంగ్లాదేశ్ కీలకమని చెప్పారు.

బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవం సహా భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏళ్లైన సందర్భంగా మోదీ ఈ నెల చివర్లో ఆ దేశ పర్యటన చేపట్టనున్నారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు జైశంకర్.

"మోదీ పర్యటన ఏర్పాట్ల కోసం మేం సన్నాహాలు చేస్తున్నాం. ఈ పర్యటన తప్పకుండా చిరస్మరణీయంగా ఉంటుంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రధాని చేపట్టనున్న తొలి విదేశీ పర్యటన ఇదే అనుకుంటా. ప్రధాని హోదాలో మోదీ రెండోసారి బంగ్లాదేశ్​లో పర్యటించనున్నారు. గత పర్యటనను మీరంతా గుర్తుంచుకునే ఉంటారు. ఇరుదేశాల సంబంధాల్లో ఆ పర్యటన చాలా మార్పులు తీసుకొచ్చింది."

-ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

బంగ్లాదేశ్​కు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమని జైశంకర్ పేర్కొన్నారు. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలకు 50 ఏళ్లు అయిన సందర్భంగా ఇరుదేశాలు 'ముజీబ్ బర్షో'ను జరుపుకుంటున్నాయని అన్నారు. బంగ్లాదేశ్​కు భారత్ ఎప్పటికీ విశ్వసనీయమైన మిత్రుడిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. దక్షిణాసియాలోనే కాకుండా, ఇండో పసిఫిక్ ప్రాంతంలోనూ బంగ్లాదేశ్​ను విలువైన భాగస్వామిగా భారత్ పరిగణిస్తోందని చెప్పారు. భద్రత, వాణిజ్యం, రవాణా, కనెక్టివిటీ, సంస్కృతి సహా ఇరుదేశాల భాగస్వామ్యాన్ని అన్ని రంగాలకు విస్తృతపరిచేందుకు పనిచేస్తున్నట్లు వివరించారు. ఇరుదేశాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు జపాన్ సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు.

"భారత్ బంగ్లా సంబంధాలు 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. వచ్చే 20 ఏళ్లపై ఇప్పుడు దృష్టిసారించాలి. మన భాగస్వామ్యానికి కనెక్టివిటీ కీలకమని నేను అనుకుంటున్నాను. ఈ ప్రాంత భౌగోళిక-ఆర్థిక పరిస్థితులను సమూలంగా మార్చడం కోసం బంగ్లాదేశ్​తో కనెక్టివిటీని పెంచేందుకు భారత్ దృష్టిసారిస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల్లో జపాన్ భాగస్వామిగా ఉంది. కనెక్టివిటీ పెంచడం వల్ల ఇక్కడి ప్రాంతం మొత్తం సమూలంగా మారిపోతుంది."

-జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

తీస్తా జలాలపై

ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకునే అనువైన సంబంధాలు ఇరుదేశాల మధ్య ఉన్నాయన్నారు జైశంకర్. ఇరుదేశాల మధ్య చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న తీస్తా జలాల పంపకంపై స్పందించారు. ఈ సమస్యపై చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే నీటి వనరుల కార్యదర్శులు ఈ అంశంపై సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఒప్పందంపై సంతకం చేసేందుకు భారత్ సుముఖంగానే ఉందని.. అంతర్గత సమస్యల వల్ల ఇది ఆలస్యమవుతోందని తెలిపారు. బీఎస్ఎఫ్ చేతిలో సరిహద్దులో మరణిస్తున్న బంగ్లాదేశీయుల సమస్యపైనా చర్చించినట్లు వెల్లడించారు జైశంకర్. ప్రతి మరణం విచారకరమేనని అన్నారు. సరిహద్దులో జరుగుతున్న నేరాల కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాల సహకారంతో వీటిని అరికట్టవచ్చని ఆశిస్తున్నట్లు తెలిపారు.

కరోనా పోరులో బంగ్లాదేశ్​కు భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. భారత్ నుంచి అత్యధిక వ్యాక్సిన్లు బంగ్లాదేశ్​కే చేరాయని తెలిపారు.

మోదీ-షేక్ హసీనా నాయకత్వంలో ఇరుదేశాల సంబంధాలు నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మోమిన్ తెలిపారు.

ఇదీ చదవండి: 'చైనా, పాక్​ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.