జీ20 సదస్సు(G20 Summit 2021) కోసం ఇటలీ పర్యటనకు(Modi Italy Tour) వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానం... పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణించింది. ఈ పర్యటన పూర్తి చేసుకుని తిరిగి భారత్ చేరుకునే క్రమంలో కూడా పాక్ గగనతలంపై(Pakistan Airspace Open For India) నుంచే మోదీ విమానం రానుంది. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది.
మోదీ విమానం బోయింగ్ 777, 300ఈఆర్, కే7066.. బహవలపుర్ నుంచి పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. టుర్బాత్, పంజ్గుర్ను దాటి వయా ఇరాన్, టర్కీ మీదుగా ఇటలీకి చేరుకుంది. ఇటలీ పర్యటన కోసం మోదీ విమానానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పాక్ విదేశాంగ శాఖను భారత్ కోరిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ వర్గాలు తెలిపాయి. దీనిపై పాక్ సానుకూలంగా స్పందించి, అనుమతించిందని(Pakistan Airspace Open For India) చెప్పాయి. ఈ మేరకు 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' తన కథనంలో పేర్కొంది.
2019లో జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో... పాక్‌పై భారత్ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో మోదీ విమానం వెళ్లేందుకు పాక్ అనుమతించడం.. ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెలలోనూ.. క్వాడ్ సదస్సులో భాగంగా మోదీ అమెరికా పర్యటన కోసం.. తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్ అనుమతించింది. అయితే.. అంతకుముందు 2019లో మోదీ సౌదీ అరేబియా పర్యటన కోసం పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని భారత్ చేసిన విజ్ఞప్తిని పాక్ నిరాకరించటం గమనార్హం.
జీ20 సదస్సు(G20 Summit 2021) కోసం శుక్రవారం ఇటలీకి చేరుకున్నారు మోదీ. అక్కడ ప్రపంచ దేశాధినేతలతో కలిసి పలు కీలక అంశాలపై చర్చల్లో పాల్గొన్నారు. గ్లాస్గోలో జరిగే కాప్26 ప్రపంచ నేతల సదస్సులో మోదీ పాల్గొంటారు.
ఇవీ చూడండి:
- '2022 చివరి నాటికి భారత్‌లో 500 కోట్ల టీకా డోసుల ఉత్పత్తి'
- అంతర్జాతీయ పన్ను సంస్కరణలకు G-20 దేశాల ఆమోదం
- G20 Summit 2021: అగ్రదేశాధినేతలతో మోదీ మాటామంతీ.. బైడెన్‌తో సరదాగా..
- 'ప్రవాస భారతీయులతో సంభాషణ గొప్పగా జరిగింది'
- పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ భేటీ- భారత్‌కు రావాలని ఆహ్వానం
- G-20 summit news: సంక్షోభ తరుణం.. సమైక్యతే శరణం!