ETV Bharat / international

చారిత్రక కాళీ మందిరాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి - శ్రీ రమ్నా కాళీ మందిరం

బంగ్లాదేశ్​లో పునర్నిర్మించిన చారిత్రక శ్రీ రమ్నా కాళీ మందిరాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్​ కోవింద్​ ప్రారంభించారు. కోవింద్​ సతీమణి సవితా కోవింద్​తో పాటు ఆలయంలో​ ప్రత్యేక పూజలు చేశారు.

President Kovind Bangladesh visit
President Kovind Bangladesh visit
author img

By

Published : Dec 17, 2021, 12:30 PM IST

President Kovind Bangladesh visit: బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా రెండో రోజు ఢాకాలో పునర్నిర్మించిన చారిత్రక శ్రీ రమ్నా కాళీ మందిరాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్​ కోవింద్​ ప్రారంభించారు. ఆయన సతీమణి సవితా కొవింద్​ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో రామ్​నాథ్​ పర్యటిస్తున్నారు.

President Kovind Bangladesh visit
శ్రీ రమ్నా కాళీ మందిరాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
President Kovind Bangladesh visit
ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న రామ్​నాథ్​ దంపతులు

మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢాకాలో నిర్వహించే 50వ 'విజయ్ దివస్' వేడుకల్లో రామ్​నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే శ్రీ రమ్నా కాళీ ఆలయాన్ని ప్రారంభించారు.

President Kovind Bangladesh visit
రమ్నా కాళీ మందిరంలో కొవింద్​ దంపతులు

50 ఏళ్ల క్రితం ధ్వంసం

1971 Indo Pak war: 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్​ బలగాలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాయి. 'ఆపరేషన్ సెర్చ్‌లైట్' పేరుతో పాకిస్థానీ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ద్వారా ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఆలయానికి నిప్పంటించాయి. ఫలితంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.

భారత్​ సాయం

ఈ మందిర పునర్నిర్మాణానికి భారత్​ కూడా సాయం చేసింది.

ముస్లిం మెజారిటీ బంగ్లాదేశ్‌లో 16.9 కోట్ల జనాభా ఉండగా.. అందులో హిందువులు దాదాపు 10 శాతం ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.