న్యూజిలాండ్‌లో బాంబు భయాందోళనలు రేపింది. క్రైస్ట్‌చర్చ్ పట్ణణంలో పేలుడు పరికరాలను, పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేశారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
గత నెలలో ఇదే ప్రాంతంలో రెండు మసీదులపై కాల్పులు జరిగిన ఘటనలో 50 మంది మరణించారు. దాడికి పాల్పడిన వ్యక్తి కారులో ఇదే తరహాలో ఆయుధాలు, పేలుడు పరికారాలున్నాయి. మార్చిలో జరిగిన దాడులకు ప్రస్తుత ఘటనకు ఏమైనా సంబధాలున్నాయా అనే విషయంపై అధికారులు స్పష్టతనివ్వలేదు.
ఇదీ చూడండి: జపాన్‌లో నవ శకం- గద్దె దిగిన చక్రవర్తి