ETV Bharat / international

అక్టోబరులో మోదీ-షింజో అబే సమావేశం!

జపాన్​ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది అక్టోబర్​లో సమావేశం అయ్యే అవకాశం ఉంది. చైనాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న వేల ఇరువురి భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది.

PM modi-japan PM sinzo abe to meet
అక్టోబరులో మోదీ-షింజో అబే సమావేశం!
author img

By

Published : Jul 20, 2020, 6:59 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే అక్టోబరులో సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా చైనా విస్తరణవాదంపైనే వీరి మధ్య చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.

భారత్‌ మాదిరిగానే జపాన్‌కు కూడా చైనాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. దక్షిణ చైనా సముద్రం అంతా తనదే అంటున్న చైనా వాదనను జపాన్‌ వ్యతిరేకిస్తోంది. ఆ రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని దీవుల విషయంలోనూ జగడం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ- షింజో అబే మధ్య సమావేశం జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకోనుంది.

ఇద్దరు ప్రధానుల మధ్య 2019 డిసెంబరులోనే అసోంలోని గువాహటిలో సమావేశం జరగాల్సి ఉంది. అప్పట్లో పౌరసత్వ సవరణ బిల్లుపై అసోంలో నిరసనల కారణంగా సమావేశం వాయిదా పడింది.

ఇదీ చూడండి: ఇజ్రాయెల్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.