ETV Bharat / international

'భారత్​-అఫ్గాన్​ బంధాన్ని ఏ శక్తీ విడదీయలేదు' - అష్రఫ్​ ఘని

అఫ్గానిస్థాన్​, భారత్​ మధ్య ఉన్న మైత్రిని ఏ శక్తి విడదీయలేదని ప్రధాని మోదీ అన్నారు. అఫ్గాన్​లో ప్రజలపై, జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాద నిర్మూలనలో అఫ్గాన్​కు భారత్​ తోడుంటుందని స్పష్టం చేశారు. అఫ్గాన్​లో భారత్​ నిర్మించ తలపెట్టిన లలాందర్​ డ్యాంకు సంబంధించిన ఒప్పందపత్రంపై మోదీ, అష్రఫ్​ ఘని సంతాకాలు చేశారు.

PM Modi expresses concern over increasing violence in Afghanistan
'అఫ్గానిస్థాన్​, భారత్​ బంధాన్ని ఏ శక్తీ విడదీయలేదు'
author img

By

Published : Feb 9, 2021, 7:58 PM IST

అఫ్గానిస్థాన్​, భారత్​ మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఏ శక్తీ విడదీయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బయటి శక్తులు అఫ్గాన్​ అభివృద్ధిని అడ్డుకోలేవని పేర్కొన్నారు. అఫ్గాన్​ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనితో వీడియో కాన్ఫరెన్స్​ సమావేశంలో పాల్గొన్నారు మోదీ. ఇటీవల అఫ్గాన్​లో సాధారణ పౌరులు, జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాద నిర్మూలనలో అఫ్గాన్​కు భారత్​ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

తాలిబన్​ మద్ధతుదారులు, రాజకీయ పార్టీలు కలిసి ఉత్తమ పరిష్కారాన్ని కనుగొంటే అఫ్గాన్​లో శాంతిపూర్వక వాతావరణం నెలకొంటుందని అష్రప్​ ఘనీ అన్నారు.

అఫ్గాన్​లో భారత్​ నిర్మించనున్న లలాందర్​ డ్యాంకు సంబంధించిన ఒప్పంద పత్రంపై మోదీ, అష్రప్​ ఘనీ సంతకాలు చేశారు. ఈ ఆనకట్ట ద్వారా కాబుల్​ నగరానికి తాగు నీటి సమస్య తీరుతుందని మోదీ అన్నారు.

ఇదీ చూడండి: అమెరికాకు ఇరాన్​ 'అణు' హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.