రెండు రోజుల భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు థింపూలోని రాయల్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 10.30 గంటలకు జాతీయ స్మారక స్తూపాన్ని సందర్శిస్తారు.
ఉదయం 11 గంటలకు భూటాన్లోని ప్రధాన ప్రతిపక్షనేత పెమా గెమత్సోతో సమావేశమవుతారు మోదీ. 12 గంటలకు రాజదంపతులు ఇచ్చే విందులో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు దిల్లీకి విమానంలో బయలుదేరతారు.
నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని పీఠం అధిరోహించిన తరువాత చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. మొదటి దఫా అధికారంలో వచ్చినపుడూ... మోదీ భూటాన్లోనే తొలిసారి పర్యటించారు.
ఇదీ చూడండి: లిత్వేనియా అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి భేటీ