విమానంలో మంటలు చెలరేగగా.. 8 మంది సజీవదహనమైన ఘటన ఫిలిప్పీన్స్‌లో సంభవించింది. మనీలా విమానాశ్రయం నుంచి జపాన్‌కు వెళ్లాల్సిన విమానం.. రన్‌వేపై ఉండగానే ప్రమాదం చోటుచేసుకుంది. బయల్దేరిన కాసేపటికే అగ్నికీలలు చెలరేగాయి. విమానంలోని ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు ధ్రువీకరించారు.
ఇందులో ఆరుగురి సిబ్బంది, ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఒక మెడికల్ మిషన్‌లో భాగంగా ఓ రోగిని టోక్యోకు తీసుకెళ్తుండగా రన్‌వే చివరికి చేరుకోగానే ఘటన జరిగినట్లు తెలిపారు. అయితే.. సాంకేతిక సమస్యతోనే ప్రమాదం తలెత్తినట్లు తెలుస్తోంది.