కరోనా వ్యాప్తి మితీమీరుతున్న తరుణంలో.. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధమత గురువు దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని, సమన్వయంతో కలిసి ముందుకొస్తేనే మహమ్మారిని ఎదుర్కోగలమని వ్యాఖ్యానించారు.
వైరస్ విసురుతున్న సవాళ్లతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడమే.. ప్రస్తుతం ప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాలు అని హెచ్చరించారు. ఈ సంక్షోభం, పర్యవసానాలను.. కేవలం సమన్వయంతోనే ఎదుర్కొనగలమని ఆయన అన్నారు.
సమస్త మానవాళిని ఏకం చేసే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు దలైలామా. అందరికీ ఒకే రకమైన భయాలు, ఆందోళనలు ఉన్నప్పటికీ.. సంతోషంగా ఉండాలనే కోరిక ద్వారా ఏకమవుతాయని ఆయన అన్నారు. పరిస్థితులను వాస్తవిక దృష్టితో చూస్తే కష్టాలను సైతం అవకాశాలుగా మార్చుకోవచ్చని దలైలామా తెలిపారు.