కంచు కోట బద్ధలైంది. పంజ్‌షేర్ సింహాల పోరాటం (panjshir resistance) ఆగిపోయింది. తాలిబన్ల అడుగు పడనివ్వని ప్రాంతం ఇప్పుడు చేతులెత్తేసింది. ఈ ప్రాంతం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది! పాకిస్థాన్ నిఘా వర్గాల సహకారంతో ఈ లోయను చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. తాలిబన్లతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు అహ్మద్ మసూద్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంత (panjshir) భవిష్యత్ ఎలా ఉంటుందన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ఏంటీ పంజ్‌షేర్?
హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షేర్ ప్రావిన్స్ (panjshir afghanistan) ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. స్థానికంగా లభించే విలువైన ఖనిజ వనరులతో ఈ ప్రాంతం ఆర్థికంగా బలంగానే ఉండేది. ప్రజలు మెరుగైన జీవనం సాగించేవారు. అఫ్గాన్ ప్రజల సగటు సంపాదనతో పోలిస్తే పంజ్‌షేర్ ప్రాంతంలోని వారి ఆదాయం చాలా ఎక్కువ.
ఇదీ చదవండి: తాలిబన్ల వశమైన 'పంజ్‌షేర్'- ప్రభుత్వం ఏర్పాటే తరువాయి!
గతంలో తాలిబన్ల పాలనను తుదముట్టించడంలోనూ పంజ్‌షేర్ (panjshir taliban) ప్రాంతానిదే కీలక పాత్ర. అక్కడి ప్రజల్లో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని మరింతగా రగిలించి (panjshir resistance) వారిని మార్గదర్శకత్వం చేసిన వారిలో తాలిబన్ వ్యతిరేక నాయకుడు అహ్మద్ షా మసూద్ (Ahmad Shah Massoud) కీలక వ్యక్తి. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషిచేశారు. అయితే తాలిబన్లు, ఆల్‌ఖైదాలు (taliban al qaeda ties) కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ 2001 సెప్టెంబర్ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో అహ్మద్ షా మసూద్ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన తనయుడు అహ్మద్ మసూద్.. తన తండ్రి పోరాట స్ఫూర్తితో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరు సాగిస్తూ వచ్చారు.
విదేశీ మద్దతుతో ఇంతకాలం..
పంజ్‌షేర్ నేతలు బలంగా ఎదురొడ్డి నిలవడానికి (panjshir resistance) కారణం వారికి విదేశాల నుంచి అందుతున్న మద్దతు. ఈశాన్య సరిహద్దులో ఉన్న తజకిస్థాన్.. లోయలోని నేతలకు అండగా (tajikistan panjshir) ఉండేది. సాయుధ దళాలు సైతం పటిష్ఠంగా ఉండటం వల్ల ఇంతవరకూ తాలిబన్లు అక్కడ అడుగు పెట్టలేకపోయారు.
1980లలో సోవియట్ యూనియన్, 90లలో తాలిబన్లతో పోరాటం సాగించాల్సి వచ్చినందున.. ఇక్కడ బలమైన రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. సొరంగాలు, భూగర్భ బంకర్లు, చొరబాటుదారులను తప్పుదారి పట్టించే రహదారులను నిర్మించారు.
దాయాది దన్నుతో..
తాలిబన్లు దేశాన్ని మళ్లీ ఆక్రమించుకున్న తర్వాత కూడా పంజ్‌షేర్ సమర్థంగానే పోరాడింది. అయితే, విదేశీ మద్దతు కొరవవడం వల్ల వెన్నుచూపక తప్పని పరిస్థితి ఎదురైంది. మరోవైపు, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్' (ISI) తాలిబన్లకు అడుగడుగునా సాయం (pakistan helping taliban panjshir) చేయడం కూడా పంజ్‌షేర్ కూలిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇన్నాళ్లు 'మాకు తెలియదు.. తాలిబన్లకు మేం సాయం చేయడం లేదు' అని చెప్పిన దాయాది.. తాజాగా నేరుగా తన డ్రోన్లను పంజ్‌షేర్‌కు పంపినట్లు వార్తలొచ్చాయి. ఈ డ్రోన్లను పంజ్‌షేర్ దళాలపై దాడి చేయడానికి వినియోగించినట్లు సమాచారం.
ఈ విషయాన్ని పాకిస్థాన్ ఎంపీ జియా అరియాంజాద్.. అమాజ్ న్యూస్‌కు వెల్లడించారు. ఈ దాడులకు పాక్ స్మార్ట్ బాంబులను (smart bombs pakistan) వినియోగించినట్లు ఆయన వివరించారు. మరోపక్క అహ్మద్ మసూద్ కూడా పాక్ డ్రోన్ల దాడులను (pakistan drone attack in panjshir) సోమవారం ధ్రువీకరించారు. తాలిబన్ ఉగ్ర సంస్థకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని వెల్లడించారు. పాకిస్థాన్ ఐఎస్‌ఐ చీఫ్ ఫయాజ్ అహ్మద్ గత కొన్ని రోజులుగా కాబుల్‌లో తిష్ఠవేశారు. ఆయన కనుసన్నల్లోనే పాక్ వాయుసేన డ్రోన్లు, హెలికాప్టర్లు దాడులు నిర్వహించినట్లు మసూద్ ఆరోపించారు. పాక్ కొంతమంది కమాండోలను కూడా ఎయిర్‌డ్రాప్ చేసినట్లు సమాచారం.
అమ్రుల్లా ఇంటిపై హెలికాప్టర్లతో దాడి..
అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నివసించే ఇంటిపై ఆదివారం హెలికాప్టర్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడి నుంచి అమ్రుల్లా సురక్షితంగా తప్పించుకొని గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు.
గతంలో వెంట్రుకవాసిలో తప్పించుకొని..
వాస్తవానికి 9/11 దాడులకు (9/11 attack) రెండ్రోజుల ముందు పంజ్‌షేర్ నాయకుడు అహ్మద్‌షా మసూద్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో మసూద్ తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆ దాడి నుంచి దాస్తీ ప్రాణాలతో బయటపడ్డారు. పంజ్‌షేర్ దళాలకు ఆయనే అధికార ప్రతినిధి. ఆయన తరచూ ట్విటర్లో ఎన్‌ఆర్‌ఎఫ్‌సీ దళాల సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. ఇటీవల ఒక ఆంగ్ల ఛానల్‌తో మాట్లాడుతూ..
"మేం ప్రతిఘటిస్తూ మరణిస్తే అది మా విజయం అవుతుంది. దేశం కోసం తుది రక్తం చుక్క వరకూ పోరాడిన యోధులుగా చరిత్రలో మా పేరు లిఖిస్తారు" అని దాస్తీ పేర్కొన్నారు. ఆదివారం జరిగిన దాడిలో ఫాహిం దాస్తీతోపాటు అహ్మద్ షా మసూద్ మేనల్లుడు సాహిబ్ అబ్దుల్ వాదూద్ జహోర్ కూడా మరణించినట్లు సమాచారం. తాము ఇద్దరు కీలక నాయకులను కోల్పోయినట్లు ఎన్‌ఆర్‌ఎఫ్‌ఏ ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు.
మత పెద్దలతో చర్చలకు సిద్ధం: అహ్మద్ మసూద్
చర్చలు జరిపి అఫ్గానిస్థాన్‌లో యుద్ధం ముగించాలని మతపెద్దలు ఇచ్చిన పిలుపునకు పంజ్‌షేర్ దళాలు సానుకూలంగా స్పందించాయి. ఈ మేరకు ఎన్‌ఆర్‌ఎఫ్‌ఏ ఫేస్‌బుక్ పేజీలో దళాల అధినేత అహ్మద్ మసూద్ స్పందించారు. "ప్రస్తుత సమస్యను పరిష్కరించుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాం. తక్షణమే పోరాటాన్ని నిలిపివేసి చర్చలు (panjshir talks) కొనసాగించాలి. దీనికి ఎన్‌ఆర్‌ఎఫ్‌ఏ దళాలు అంగీకరిస్తున్నాయి. తాలిబన్లు కూడా దాడులను నిలిపివేయడంతోపాటు పంజ్‌షేర్, అంద్రాబ్‌లకు సైనిక బలగాల తరలింపును కూడా ఆపేయాలి" అని మసూద్ పేర్కొన్నారు. అంతకుముందు అఫ్గానిస్థాన్‌లోని మతపెద్దలు.. తాలిబన్లు చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి తాలిబన్లు వెంటనే స్పందించలేదు.
తాలిబన్ల సోషల్ మీడియా వార్..
ఇప్పటికే పంజ్‌షేర్ దళాలకు సోషల్ మీడియా వంటివి అందుబాటులో లేకుండా తాలిబన్లు చర్యలు తీసుకున్నారు. విద్యుత్ లైన్లు, టెలిఫోన్ లైన్లు, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. మరో పక్క ఏకపక్షంగా గత కొన్ని రోజులుగా పలుమార్లు పంజ్‌షేర్‌ను (panjshir taliban control) ఆక్రమించుకున్నట్లు తాలిబన్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకొన్నారు. కానీ, ఆ తర్వాత అటువంటిదేమీ లేదని తేలింది.
ఇదీ చదవండి:
'పంజ్‌షేర్' తాలిబన్లకు లొంగుతుందా?