కశ్మీర్ విషయంలో భారత్ నిర్ణయంపై పాకిస్థాన్‌లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాక్‌లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ కొత్త నాటకానికి తెరతీశారు. కశ్మీరీలకు మద్దతుగా కొన్ని ప్రాంతాలకు కశ్మీర్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు.
"రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలోని ఒక రహదారికి కశ్మీర్ రోడ్‌గా నామకరణం చేస్తాం. 5 ప్రధాన ఉద్యానవనాలను కశ్మీర్ పార్కులుగా పిలుస్తాం. కశ్మీరీలకు మా సంఘీభావం ఈ విధంగా తెలియజేస్తాం."
-ఉస్మాన్ బుజ్దార్, పంజాబ్ ముఖ్యమంత్రి
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దును ఓ అంతర్జాతీయ సమస్యలా చూపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది పాక్. ఇందులో భాగంగానే భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని బ్లాక్‌డే గా అభివర్ణించింది. పాక్ స్వాతంత్ర్య దినమైన ఆగస్టు 14ను కశ్మీర్ సంఘీభావ దినంగా ప్రకటించింది.
ఇదీ చూడండి: 'పరిస్థితులను బట్టే అణ్వస్త్రాల వినియోగంపై నిర్ణయాలు'