ETV Bharat / international

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​ - పాకిస్థాన్​ రైల్వే మంత్రి

పాకిస్థాన్​ మాజీ ప్రధాని షాహిద్​ అబ్బాసీకి కరోనా వైరస్​ సోకింది. నివేదిక అందిన వెంటనే ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మరోవైపు ప్రస్తుత రైల్వేశాఖ మంత్రి షేక్​ రషీద్​కు కూడా వైరస్​ నిర్ధరణ అయ్యింది.

Pak's former prime minister Abbasi, Railways Minister Rashid test positive for coronavirus
మాజీ ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్​
author img

By

Published : Jun 8, 2020, 7:08 PM IST

పాకిస్థాన్​లో కరోనా వైరస్​ ఉగ్రరూపం దాల్చింది. ప్రముఖ నేతలు, అధికారులకు కూడా వైరస్​ సోకడం ఆ దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా పాక్​ మాజీ ప్రధానమంత్రి షాహిద్​ ఖాకన్​ అబ్బాసీకి కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయనతో పాటు ప్రస్తుత రైల్వేమంత్రి షేక్​ రషీద్​ అహ్మద్​ కూడా వైరస్​ బారినపడ్డారు.

61ఏళ్ల అబ్బాసీకి వైరస్​ నిర్ధరణ అయినట్టు పాకిస్థాన్​ ముస్లిం లీగ్​-నవాజ్​(పీఎమ్​ఎల్​-ఎన్​) ప్రతినిధి ధ్రువీకరించారు. రిపోర్టుల్లో పాజిటివ్​గా తేలడం వల్ల.. అబ్బాసీ సోమవారం స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు స్పష్టం చేశారు.

2017 ఆగస్టు-2018 మే మధ్య కాలంలో పాక్​ ప్రధానిగా విధులు నిర్వర్తించారు అబ్బాసీ.

రైల్వే మంత్రికీ...

పాకిస్థాన్​ రైల్వే మంత్రికి వైరస్​ పాజిటివ్​గా తేలినట్టు రషీద్​ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైద్యుల సలహా మేరకు రషీద్​ రెండు రోజుల పాటు క్వారంటైన్​లో ఉంటారని స్పష్టం చేసింది.

పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ నేత షార్జిల్​ మేమొన్​, పాకిస్థాన్​ తెహ్రీక్​-ఏ-ఇన్సాఫ్​ చట్టసభ్యుడు చౌదరి అలీ అఖ్తర్​కు కూడా కరోనా సోకింది.

కరోనా వైరస్​తో పాకిస్థాన్​లో ఇప్పటివరకు నలుగురు చట్టసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. విదేశాంగ కార్యాలయంలోని ఇద్దరు అధికారులు సహా మొత్తం ఐదుగురు వైరస్​ బారినపడ్డారు.

పాకిస్థాన్​వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,671కు చేరింది. మహమ్మారి బారిన పడి ఆ దేశంలో ఇప్పటివరకు 2,067మంది మరణించారు.

ఇదీ చూడండి:- భారత్​తో సరిహద్దు రగడపై చైనా శాంతి మంత్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.